today rasi phalalu: ఈ రాశులవారు శుభవార్తలు వింటారు.. మీరున్నారా!!
నేడు గ్రహాల గమనం కారణంగా వివిధ రాశుల వారి జాతకాలు ఈ విధంగా ఉన్నాయి. నేటి గ్రహాలు గమనం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. మరికొన్ని రాశుల వారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేడు మేషరాశి నుండి కన్యా రాశి వరకు వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి జాతకులకు ఈ సమయం మిశ్రమకాలం. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ మీరు మనోబలం తగ్గకుండా చూడాలి. నేడు విష్ణువుని ఆరాధించడం మేషరాశి వారికి మేలుగా చెప్పబడింది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. నేడు మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు వీరికి కచ్చితంగా అన్ని విధాలా కలిసొస్తుంది. మీ మీ రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతుంది. విందు వినోద వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానుకోకూడదు.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఒక శుభవార్త మిధున రాశి జాతకులకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మీ పనితీరును ఈరోజు అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూల వాతావరణం ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు సమయానికి సహాయం చేసేవారు మీకు దొరుకుతారు. నేడు ముఖ్యమైన వ్యవహారాలలో మంచి ఫలితాలను మీరు పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానం చేయడం మరింత ఉత్సాహాన్ని. మంచి ఫలితాలను ఇస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలంతో వ్యవహరించడం వల్ల కొన్ని కీలకమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్ట దేవత నామస్మరణ చేయడం నేడు సింహరాశి జాతకులకు మంచిదని సూచించబడింది.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు తొందరపాటు మంచిది కాదని చెప్పబడింది. ఏ నిర్ణయం తీసుకున్న బంధుమిత్రులను సంప్రదించటం మంచిదని సూచన. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శ్రమ పెరగకుండా జాగ్రత్త తీసుకోండి. నేడు ధన వ్యయం ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications