vasant panchami 2024: ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. మీకు అన్నీ విజయాలే!!
ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం వసంత పంచమి రేపు ఫిబ్రవరి 14వ తేదీన వస్తుంది. వసంత కాలంలో వచ్చే పంచమికి వసంత పంచమి అని పేరుంది. అయితే ఇదే రోజు సరస్వతీ మాత పుట్టినరోజుగా చెప్తారు. కాబట్టి సరస్వతి దేవి పూజతో వసంత పంచమి అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
వసంత పంచమి కేవలం ప్రకృతికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు. వసంత పంచమి మన జీవితాల్లో అదృష్టాన్ని, శ్రేయస్సును ఆహ్వానించే వేడుక కూడా. అయితే వసంత పంచమి రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మీకు శుభాలు చేకూరుతాయి. అన్ని పనులలోను విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ఇక వసంత పంచమి రోజు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వసంత పంచమి రోజు ఇంటికి సరస్వతీ దేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని తెచ్చుకుంటే మంచిది. సరస్వతి దేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు జ్ఞానం, మరియు అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. వసంత పంచమి నాడు ఇంట్లో సాంప్రదాయమైన వసంత పంచమి వంటకాలతో పాటు ఇంటికి స్వీట్లు తెచ్చుకోవడం మంచిది. స్వీట్స్ తెచ్చి కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో పంచుకోవడం వల్ల బంధాలు బలపడతాయి అని చెబుతారు.
వసంత పంచమి నాడు సంగీత వాయిద్యాలు ఇంటికి తెచ్చుకోవాలి, సరస్వతి దేవికి కళలు అంటే ఇష్టం కాబట్టి, సంగీత వాయిద్యాలు కొనుగోలు చేస్తే మంచిది. సంగీత వాయిద్యాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే శుభాలు జరుగుతాయని, జీవితంలో సంతోషం, సామరస్యం వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. వసంత పంచమి నాడు ఇంటి అలంకరణకు కావలసిన వస్తువులను, అందులోనూ పసుపు రంగులో ఉన్న వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది .
వసంత పంచమి నాడు ఇంటికి పూల మొక్కలను తెచ్చుకుంటే మంచిది. మొక్కలను ఇంటికి తీసుకురావడం అభివృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. అంతే కాదు వసంత పంచమి రోజు పుస్తకాలు, స్టేషనరీ వంటివి కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల విజ్ఞాన సంపన్నులు అవుతారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications