• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: తరచూ అనారోగ్యమా? ఈ సింపుల్ వాస్తు టిప్స్ తో రోగాలకు చెక్!!

|
Google Oneindia TeluguNews


అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్న చందంగా చాలా మంది ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలామంది తరచు అనారోగ్యానికి గురవుతుంటారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పెద్దగా ఆరోగ్యం విషయంలో మార్పు ఉండదు. ఒక అనారోగ్య సమస్యకు మందులు వాడి అది తగ్గింది అనుకునే సమయానికి, మరొక అనారోగ్యం వచ్చి పడుతుంది. ఇలా తరచూ అనారోగ్యాలకు గురయ్యే వారు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే కొంతమేర అనారోగ్యం బారి నుండి బయటపడవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ వాస్తు చిట్కాలు ఏమిటి అంటే..

అనారోగ్యం నుండి బయటపడాలి అంటే ఈశాన్యదిశలో ఈ పని చెయ్యండి

అనారోగ్యం నుండి బయటపడాలి అంటే ఈశాన్యదిశలో ఈ పని చెయ్యండి


ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు ఈశాన్య దిశలో నిజం దీపం వెలిగించడం వల్ల, కొంతమేర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవిధంగా చేయడం మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనారోగ్యంతో బాధపడేవారు ఇంట్లో వాటర్ పైప్ లైన్ లీకేజ్ లేకుండా చూసుకోవాలి. కుళాయిలు, వాటర్ పైప్ లైన్ లీకేజ్ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో వాటర్ లీకేజీ లేకుండా చూసుకోవాలి.

ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో ఉంటే కొంత రోగాల నుండి ఉపశమనం

ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో ఉంటే కొంత రోగాల నుండి ఉపశమనం

ఇంట్లో ఉన్న మెట్ల కింద చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. మెట్ల కింద చాలామంది స్టోర్ రూమ్ లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మెట్లకింద ఎప్పుడూ శుభ్రంగా ఉంటే అది ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని సూచిస్తున్నారు. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో ప్రతికూల ప్రభావం లేకుండా, ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ తో ఉండేలా చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం తోపాటు కిటికీలు తలుపులు తెరిచి ధారాళంగా గాలి వచ్చేలా చూసుకోవాలి.

ఇంట్లో శ్రేయస్సు కలిగించే మొక్కలు పెట్టాలి

ఇంట్లో శ్రేయస్సు కలిగించే మొక్కలు పెట్టాలి

ఇక గాలిని ప్యూరిఫై చేసే మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కొంతమేరకు అనారోగ్య సమస్యల నుండి పరిష్కారం లభిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంట్లో తులసితో పాటు, శ్రేయస్సును కలిగించే మొక్కలను పెట్టుకోవాలి. ఇక అనారోగ్యంతో బాధపడేవారు వంటగదికి, ఆనుకుని ఉండేలా బాత్రూమ్ లను నిర్మాణం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ ఇంట్లో వారికి కచ్చితంగా ఎప్పటికీ తగ్గని రోగాలు వేధిస్తూ ఉంటాయి. ఇక బాత్ రూమ్ ల ఏర్పాటు విషయంలో జాగ్రత్త.

అనారోగ్యాల నుండి ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి

అనారోగ్యాల నుండి ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి


ఆగ్నేయంలోనే వంటగది, నైరుతి మూల పడకగదిని నిర్మించుకోవాలి. అందుకు భిన్నంగా ఈ రెండు గదులను ఎక్కడ నిర్మించినా అనారోగ్యం పక్కా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే తరచూ అనారోగ్యాల బారిన పడేవారు కొంతమేరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక దక్షిణం దిక్కు కాళ్ళు పెట్టి పడుకోవటం, పడకగదిలో మంచానికి ముందు అద్దం ఉండటం కూడా అనారోగ్యాలకు కారణం. ఇక ఇవి లేకుండా చూసుకుంటే రోగాల నుండి కాస్త ఉపశమనం.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

బల్లి మీద పడితే శుభమా.. అశుభమా? శరీరభాగాలపై బల్లి పడితే జరిగిదిదే!!బల్లి మీద పడితే శుభమా.. అశుభమా? శరీరభాగాలపై బల్లి పడితే జరిగిదిదే!!

English summary
Many people suffer from frequent illnesses. But it is said that if you follow small Vastu tips, you will get some relief from diseases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X