vastu tips: ఇంటికి తూర్పు ఇలా ఉంచితే తీవ్ర నష్టాలు; ముఖ్యంగా పురుషులు జాగ్రత్త!!
తూర్పుకు అధిపతి అయిన సూర్యుడు తూర్పు దిక్కును పాలిస్తాడు. ఇంటికి తూర్పు దిశ ఎప్పుడు పూర్తిగా కప్పబడి ఉండకూడదు. అలా ఉంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంటిని నిర్మించుకునేటప్పుడు కచ్చితంగా దిక్కులకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. ఏ దిక్కుకు అధిపతి ఎవరు? ఏ దిక్కు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అనేక విషయాలను తెలుసుకోవాలి. వాస్తుకు అనుకూలంగా ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా, దిక్కుల విషయంలో వాస్తు శాస్త్ర నిపుణులు సూచించిన వాస్తు నియమాలను పాటించాలి. ఏ దిక్కులో ఏం చేయొచ్చు? ఏమి చేయకూడదు? వంటి అనేక వివరాలను తెలుసుకోవాలి.

తూర్పు దిశకు అభిముఖంగా ఇల్లు.. సంతోషాలకు నిలయం
ఇక దిక్కులలో అత్యంత ప్రాధాన్యత ఉన్న దిక్కు అయిన ఇంటికి తూర్పు దిశ ఏ విధంగా ఉండాలి? తూర్పు దిశ ఏ విధంగా ఉంటే ఇంటికి కలిసి వస్తుంది? తూర్పు దిశ విషయంలో గృహస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? వంటి అనేక విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది తూర్పు అభిముఖంగా ఉన్న ఇళ్ల స్థలాలు అంటే ఇష్టపడతారు. అందుకు కారణం తూర్పు అభిముఖంగా ఉన్న ఇల్లు సంతోషాలకు నిలియంగా మారుతుంది . తూర్పుకు అభిముఖంగా ఉన్న ఇళ్ళు ఆ సూర్యుడు దయవల్ల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును సంతరించుకుంటాయి.

తూర్పు దిక్కు విషయంలో జాగ్రత్త అవసరం
తూర్పుకు అధిపతి అయిన సూర్యుడు తూర్పు దిక్కును పాలిస్తాడు. అందుకే మనం సహజంగా ఇల్లు నిర్మించుకునేటప్పుడు ప్రధాన ద్వారం తూర్పు వైపున ఉండేలా జాగ్రత్త పడతాం. ప్రతిరోజు తూర్పు వైపు నుండి సూర్యకాంతి ఇంట్లో ప్రవేశిస్తే మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న తూర్పు దిక్కు విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తూర్పు ఎప్పుడు క్లోజ్ చేసినట్టు ఉంటే తీవ్ర పరిణామాలు
తూర్పు దిక్కున ఖాళీగా ఉందని ఏది పడితే అది పెట్టి, ఆ ప్రాంతాన్ని అంతా నింపకూడదు. చెత్తా చెదారం అసలే వెయ్యకూడదు, పాత సామాన్లను పెట్టకూడదు. ఇంటికి తూర్పు దిశ ఎప్పుడు పూర్తిగా కప్పబడి ఉండకూడదు. అలా ఉంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తూర్పు దిశలో ఎప్పుడు ఎత్తైన మట్టి కుప్పలు ఉండకూడదు. అలా అని ఇంటి ముందు బాగా లోతైన గుంటలు కూడా ఉండకూడదు. ఎప్పుడూ దక్షిణం దిక్కు, పడమర దిక్కు కంటే కాస్త ఎత్తు తక్కువగా తూర్పు, ఉత్తరం ఉండాలి.

తూర్పు, ఈశాన్యం, ఉత్తరం క్లోజ్ చేస్తే భయంకరమైన నష్టాలు
ఇక ఇంటికి తూర్పు వైపున ఇంటి ప్రధాన ద్వారాన్ని కనిపించకుండా చేసేలా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. ఇంటి తూర్పు పూర్తిగా కప్పబడి ఉంటే ఆ ఇల్లు మగవాళ్ళు లేని ఇల్లుగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక ఇదే సమయంలో ఇంటికి ఉత్తరం దిశ పూర్తిగా కప్పబడి ఉంటే, ఆ ఇంట్లో స్త్రీలు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈశాన్యం దిక్కు బాగా కప్పబడిపోయి ఉంటే ఆ కుటుంబంలో మగ పిల్లలు లేకుండా పోతారు. కాబట్టి ఎప్పుడూ తూర్పు, ఉత్తర దిశలను ఖాళీగా ఉంచాలి. పొరపాటున కూడా బరువు పెట్టకూడదు. వాటిని పూర్తిగా మూసివేసేలా చెయ్యకూడదు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications