vastu tips: చీకటి పడ్డాక దానాలు చేస్తున్నారా? ఈ వస్తువులు దానంచేస్తే ధననష్టం తప్పదు!!
చీకటి పడ్డాక దానాలు చేస్తున్నారా? అయితే ఈ వస్తువులు దానంచేస్తే ఆర్ధికనష్టాలు తప్పవు అంటున్నారు వాస్తు నిపుణులు.
దానధర్మాలు చేయడం హిందూ మతంలో చాలా గొప్పగా పరిగణించబడింది. అయితే దానధర్మాలు చేయడానికి కూడా ఒక సమయం, సందర్భం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎప్పుడు పడితే అప్పుడు దానం చేస్తే అది ఒక్కొక్కసారి మన ఆర్థిక పరిస్థితి పై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ఇక కొన్ని వస్తువులను దానం చేయడం కూడా మంచిది కాదని, కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సంపదని కోల్పోయే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇక సాయంత్రం తర్వాత దానం చేయడం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు దానం చేస్తే ధన నష్టం
సూర్యాస్తమయం తర్వాత ప్రతి ఒక్కరు కొన్ని దానాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎవరూ పాలు, పెరుగు వంటి వాటిని దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. హిందూ ధర్మంలో పాలు చాలా పవిత్రమైనవిగా, లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు, దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది. డబ్బుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.

సూర్యాస్తమయం తర్వాత ఇది దానం అసలే చెయ్యొద్దు
సూర్య సమయం తర్వాత దానం చేయకుండా ఉండవలసిన మరొక ముఖ్యమైన వస్తువు పసుపు. పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది. పసుపును అనేక శుభకార్యాలలో ఉపయోగిస్తారు. పసుపు లేకుండా ఎటువంటి ప్రత్యేక పూజలు పూర్తికావు. ఇక అటువంటి పసుపును సాయంత్రం చీకటి పడిన తర్వాత దానం చేస్తే జాతకంలో బృహస్పతి బలహీనమవుతారు. బృహస్పతిని సంపద గ్రహంగా పరిగణిస్తారు. అటువంటి సంపద గ్రహానికి చిహ్నమైన బృహస్పతి కి సంబంధించిన పసుపును చీకటి పడిన తర్వాత దానం చేయడం వల్ల ధన నష్టం సంభవిస్తుంది. లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది.

కొన్ని వస్తువులు చీకటి పడ్డాక దానం చేస్తే ప్రతికూల ప్రభావం
సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదని మరికొన్ని వస్తువులను చూసినట్లయితే వెల్లి పాయలు, ఉల్లిపాయలను కూడా పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత దానం చేయకూడదు. దానధర్మాలను చేయడం మంచిదే అయినప్పటికీ కొన్ని గ్రహాలకు సంబంధించిన కొన్ని వస్తువులను చీకటి పడిన తర్వాత దానం చేస్తే ఆ గ్రహాల ప్రభావం మన పైన కచ్చితంగా ఉంటుంది. అందుకే పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత దానాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications