Vastu tips: సంపదలనిచ్చే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈ దిశలో పెడితేనే ఐశ్వర్యం!!

చాలామంది ఇళ్లలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఇక లక్ష్మీదేవిని పూజించే ఇళ్లల్లో కొన్ని నియమాలను కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పబడింది. సరైన దిక్కులో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి పూజిస్తేనే ఫలితం ఐశ్వర్యం వస్త

హిందూమతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఆ ఇంట్లో సిరిసంపదలు తగ్గుతాయని, కటాక్షం లేకపోతే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని నమ్ముతుంటారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉన్నవారు జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును కూడా పొందుతారని చెబుతూ ఉంటారు. అందుకే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు చేయకూడదని కూడా చెబుతారు.

 లక్ష్మీ దేవిని పూజించేవారు ఈ నియమాలు పాటించాలి

లక్ష్మీ దేవిని పూజించేవారు ఈ నియమాలు పాటించాలి


చాలామంది ఇళ్లలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఇక లక్ష్మీదేవిని పూజించే ఇళ్లల్లో కొన్ని నియమాలను కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పబడింది. అన్నిటికంటే ముందు లక్ష్మీదేవిని పూజించే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎప్పుడూ చెత్తా చెదారాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారి విగ్రహాన్ని తప్పు దిశలో ఉంచడం కూడా ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అందుకే లక్ష్మీ పూజ చేసేవారు అమ్మవారి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో తెలుసుకోవాలి. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం విగ్రహాన్ని ఉంచి, లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి కటాక్షం కచ్చితంగా ఉంటుందని చెబుతారు.

 లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈ దిశలో పెట్టకండి

లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈ దిశలో పెట్టకండి


వాస్తు శాస్త్రంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టడానికి నిర్దిష్టమైన స్థానం సూచించబడింది. పొరపాటున కూడా లక్ష్మీ విగ్రహాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. దక్షిణ దిశను యమరాజు నివసించే దిశగా పరిగణిస్తారు. దక్షిణానికి యముడు అధిపతి. అటువంటి పరిస్థితిలో వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచడం అశుభం. ఈ దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచితే ఇంట్లో సంపద క్రమంగా తరిగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు మీద పడే అవకాశం ఉంటుంది.

ఈ దిశలో లక్ష్మీ దేవి చిత్రం లేదా విగ్రహం పెడితే ఇంట్లో సంపద

ఈ దిశలో లక్ష్మీ దేవి చిత్రం లేదా విగ్రహం పెడితే ఇంట్లో సంపద


లక్ష్మీదేవి యొక్క విగ్రహము లేదా చిత్రపటం ఎప్పుడు ఇంట్లో ఉత్తర దిశలోనే ఉండాలని చెప్పబడింది. ఉత్తర దిశ సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఉండే దిశ. అలాగే విష్ణుమూర్తి నివసించే దిశ. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఉత్తర దిశలో ఆమె చిత్రపటాన్ని ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనలక్ష్మి తాండవమాడుతుంది.

లక్ష్మీదేవి నిలుచున్నట్టు ఉండే చిత్రాన్ని, విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు

లక్ష్మీదేవి నిలుచున్నట్టు ఉండే చిత్రాన్ని, విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు


ఇక ఇంట్లో లక్ష్మి పూజ చేసే వారు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఎప్పుడూ లక్ష్మీదేవి నిలువెత్తు బొమ్మను ఇంట్లో ఉంచుకోకూడదు. లక్ష్మీదేవి నిలుచున్నట్టుగా ఉన్న చిత్రపటాన్ని ఉంచడం ద్వారా ఆమె ఇంట్లో ఎక్కువ కాలం ఉండదు. లక్ష్మీదేవి నిలుచున్న చిత్రపటం ఆమె ప్రయాణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆమె ఆ ఇల్లు వదిలిపెట్టి మరొక ప్రదేశానికి వెళుతుంది. అందుకే ఎప్పుడూ కూర్చుని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.

ఒకటి కంటే ఎక్కువ లక్ష్మీదేవి చిత్రాలు, విగ్రహాలు ఉంటే జరిగేదిదే

ఒకటి కంటే ఎక్కువ లక్ష్మీదేవి చిత్రాలు, విగ్రహాలు ఉంటే జరిగేదిదే


ఇక లక్ష్మీదేవిని ఇంట్లో పూజించేవారు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఇంట్లో ఒకటి కంటే లక్ష్మీదేవి విగ్రహాలు కానీ, చిత్రపటాలు కానీ ఉండకూడదు. అలా లక్ష్మీదేవికి సంబంధించిన ఎక్కువ చిత్రపటాలను, విగ్రహాలను పెట్టుకోవడం అశుభంగా పరిగణించబడుతుంది. దానివల్ల ఇంటికి శుభ ఫలితాలు ఉండకపోగా, ప్రతికూల ఫలితాలు కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని పూజించేవారు లక్ష్మీ కటాక్షం వారి జీవితం పైన కచ్చితంగా ఉండాలి అంటే ఈ నియమాలను తెలుసుకోవాలి.


disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+