Vastu tips: చేతుల్లో ఈ వస్తువులు ఉన్నప్పుడు జాగ్రత్త.. పడిపోతే ఆర్ధికనష్టం, అశుభం!!
చేతి నుండి వస్తువులు జారి పడిపోవటాన్ని చాలామంది దురదృష్టంగా భావిస్తారు. నిజమే కొన్ని వస్తువులు చేతి నుండి జారి పడిపోవడం నిజంగానే దురదృష్టమని చెప్పాలి. చాలాసార్లు చేతిలో నుంచి ఏదో ఒకటి జారి నేలమీద పడిపోతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వస్తువులు చేతుల నుండి జారి నేలపై పడడం చాలా అశుభంగా చెబుతారు.
ఇవి ఒక వ్యక్తి యొక్క వైఫల్యాలకు, నష్టానికి సంకేతాలుగా చెబుతారు. అసలు మన చేతుల్లో నుంచి ఏదైనా జారిపడిపోతే దాని అర్థం ఏమిటి? ఏ వస్తువులు ముఖ్యంగా చేతిలో నుంచి జారి పడకూడదు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేతిలో నుంచి జారి పడకూడని ముఖ్యమైన వస్తువు ఉప్పు.

చేతులలో నుండి ఉప్పు జారిపడితే వారి జాతకంలో బలహీనంగా శుక్రుడు, చంద్రుడు ఉన్నట్టు చెబుతారు. ఇది వ్యక్తుల యొక్క ఆరోగ్య జీవితంపై, కుటుంబ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చేతుల నుండి జారి పడకూడని మరొక వస్తువు నూనె. నూనె చేతుల నుండి జారి పడిపోవడం అంటే శనికి ఆగ్రహం తెప్పించటమే. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు.
జాతకంలో శని ప్రతికూల ఫలితాలు ఇచ్చే సమయంలో చేతుల నుండి నూనె జారిపడుతుంది. దీంతో వారు జీవితంలో పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి సంకేతమని గుర్తించాలి. చేతుల నుండి జారిపడిపోకూడని మరొక ముఖ్యమైన వస్తువు పూజ పళ్లెం. పొరపాటున అయినా చేతుల నుండి పూజ పళ్లెం జారి పడిపోయింది అంటే భగవంతుడు మీ పట్ల దయ చూపడు అని అర్థం. ఇది భవిష్యత్తులో అతి పెద్ద సమస్యలకు కారణమవుతుందని సంకేతం.

చేతుల నుండి జారిపడిపోకూడని మరొక ముఖ్యమైన వస్తువు పాలు. చేతుల నుండి పాలు పడిపోవడం ఆర్థిక సమస్యలకు మూలం అవుతుందని, ఇది అశుభ సంకేతమని చెబుతున్నారు. పాలు జారి పడిపోయి నేలపాలైతే కష్టం అంతా వృధా అవుతుందని చెప్తారు. ఈ వస్తువులు చేతుల నుండి జారి పడిపోతే కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని, కనుక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications