Vastu tips: ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే డబ్బుకు లోటుండదు!!
వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించిన అనేక నియమాలు చెప్పబడ్డాయి. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏ విధంగా అయితే వాస్తు అవసరమో ఇంట్లో వస్తువులను పెట్టుకునే విషయంలోను, ఇంటిని నిర్వహించుకునే విషయం లోనూ వాస్తు అంతే అవసరం. ఇంట్లో వాస్తు సరిగా లేకపోతే ఆ ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉండదు.
ఇంట్లో సానుకూల ప్రభావాన్ని కలిగించే వస్తువులు
ఆర్థిక పరమైన ఇబ్బందులు చోటు చేసుకోవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇంటికి వాస్తు విషయంలో ఎప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తును అనుసరించి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచటం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ఈ వస్తువులు మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. మరి ఆ వస్తువులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

పిరమిడ్ .. వాస్తు దోషాలను తగ్గిస్తుంది
వాస్తు శాస్త్రంలో పిరమిడ్లు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో పిరమిడ్ ను ఉంచటం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. అయితే ఇంట్లో వెండి ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ఉంచడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. వాస్తును అనుసరించి ఆర్థికమైన పరిస్థితులను బలంగా ఉంచుకోవడానికి, సానుకూలమైన శక్తిని కొనసాగించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి.
పంచముఖ ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి కుబేరుల ఫోటోలు
పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ సరైన దిశలో ఉంచి ప్రతిరోజు పూజలు జరపాలి. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం తొలగిపోతుంది.పూజ స్థలంలో లక్ష్మీదేవి యొక్క పద్మంపై కూర్చున్న ఫోటోలు కానీ విగ్రహాన్ని, అలాగే కుబేరుడు ఉన్న ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచడం పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. దీంతో ఆ ఇంట్లో డబ్బు కొరత కూడా తీరుతుంది.
ఇంట్లో నీళ్ళ బిందె ఈ దిశలో ఉంచాలి
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో నీళ్లతో నిండిన బిందె ఉండాలి. ఇది ఇంటికి ఉత్తర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా ఈ కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకున్నప్పటికీ ఆర్థికపరమైన శ్రేయస్సు కలుగుతుంది. ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications