Vastu tips: ఇంట్లో డబ్బు నిలవటం లేదా?

చాలామంది ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. ఇంట్లో డబ్బు ఉండడం లేదని బాధపడేవారు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే ధనలక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది. ఇంట్లో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచిది. తెలిసీ తెలియక చేసే తప్పుల కారణంగా కూడా ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవదు.

ఈ పనులు చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు
చాలామంది మంచంపై కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ధనలక్ష్మికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెబుతారు. అంతేకాదు స్త్రీలు పొద్దున లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేయకుండా ఉంటే కూడా ఇంట్లో ధనం నిలువదని చెబుతున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ముఖాన బొట్టు కూడా పెట్టుకోకుండా ఇల్లాలు భర్త ముఖం చూడరాదని అలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని చెబుతున్నారు.

Vastu tips money does not last at home may be these are the reasons

ముఖ్యంగా మహిళలు ఇలా ఉంటే డబ్బు నిలవదు
సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని చెబుతున్నారు. ఎవరైతే తరచూ ఇంట్లో భర్త పైన పిల్లలపైన అరుస్తూ ఉంటారో, చిరాకు పడతారో, ఆ ఇంట్లో డబ్బు నిలవదు అని చెబుతున్నారు. అంతేకాదు సరిగ్గా ఉడకని ఆహారం తీసుకునే వారి ఇళ్లల్లోనూ డబ్బు ఉండదని చెబుతున్నారు. ఎప్పుడూ ఇంట్లో ఆడవాళ్లు ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందని చెబుతున్నారు.

అశుభ్రంగా ఉండే ఇళ్ళలో డబ్బు నిలవదు
ఇల్లు అశుభ్రంగా ఉన్న ఇంట్లోనూ, ఎప్పుడూ తిన్న ఎంగిలి ప్లేట్లు శుభ్రం చేయకుండా ఉండే ఇంట్లోను లక్ష్మీదేవి ఉండలేదని చెబుతున్నారు. బూజు పట్టి, చెత్తాచెదారంతో కూడుకుని ఉన్న ఇల్లు దరిద్ర దేవతకు అలవాలంగా మారుతుందని, అక్కడ డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవదని చెబుతున్నారు.

డబ్బు ఇంట్లో నిలవాలంటే ఇలా చెయ్యాలి
కాబట్టి ఇంట్లో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు పై విషయాలను తెలుసుకొని తదనుగుణంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నియమాలను పాటించడమే కాదు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుని ప్రతిరోజు తాము చేసే కష్టాన్ని సక్రమంగా చేస్తూ జీవితాన్ని సాగించాలి. పొదుపు అలవాటు చేసుకోవాలి. అప్పుడే డబ్బు ఇంట్లో నిలుస్తుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+