Vastu tips: సంసారంలో చిరాకులా.. అయితే ఈ వాస్తుచిట్కాలు ట్రై చెయ్యండి!!
వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే ముఖ్యంగా పడక గది వాస్తు సానుకూలంగా ఉండాలి. అంతే కాదు ఇంట్లో మనకు తెలిసి తెలియక పెట్టే కొన్ని వస్తువుల వల్ల, చిన్న చిన్న తప్పుల వల్ల వాస్తు దోషాలు చోటు చేసుకుంటాయి. వాస్తు దోషాలు భార్యాభర్తల దాంపత్య జీవితానికి అవరోధాలుగా మారుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో భారీగా ఫర్నిచర్ ఉంటే అది అనేక సమస్యలను తీసుకొస్తుంది. అందువల్ల భార్యాభర్తల పడక గదిలో తక్కువ బరువు ఉండే ఫర్నిచర్ ను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గదిలో భారీగా ఫర్నిచర్ ఉంటే దానిని దక్షిణం లేదా పశ్చిమ గోడ వైపు పెట్టాలి. పొరపాటున కూడా ఉత్తరం, తూర్పు దిక్కున భారీ ఫర్నిచర్ ను పెట్టకూడదు.

అంతే కాదు లేత రంగుల ఫర్నిచర్ పడకగదిలో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ముదురు రంగులు ఉన్న ఫర్నిచర్ ప్రతికూలతలకు కారణంగా మారుతుంది. కాబట్టి లేత రంగు ఉండే ఫర్నిచర్ ని ఇంట్లో పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం పడక గదిలో కిటికీ ఉండాలి. అది గదిలోకి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. భార్య భర్తల సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో ఉపయోగించే చర్చల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
పడకగదిలో ఫర్నీచర్, మంచాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా తయారు చేసేటప్పుడు చెక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. రోజ్ వుడ్, గంధం, అశోక, టేకు, వేప చెక్కతో చేసిన ఫర్నిచర్ ను మాత్రమే ఇంట్లో ఉపయోగించాలి. ఇవి మాత్రమే ఇంట్లో శుభ ఫలితాలను ఇస్తాయి. భార్యాభర్తల సంబంధాలలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే గదిలో తాజా పువ్వులు పెట్టండి. ఎప్పుడూ గదిలో తాజా పువ్వులను ఉంచడం వల్ల చిన్నచిన్న గొడవలను సర్దుబాటు అవుతాయి.
భార్య భర్తల మధ్య మనస్పర్ధలతో గ్యాప్ ఎక్కువగా ఉంటే రెండు ఎరుపు రంగు కొవ్వొత్తులను గదిలో వెలిగించండి. ఇలా చేయడం వల్ల వారిద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గి వారి మధ్య అనుబంధం బలపడుతుంది. పడక గదిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో తుడవండి. గది గోడలకు లేత రంగులు మాత్రమే పెయింట్ చేయండి.

గదిలో బూజు లేకుండా చూసుకోండి. బెడ్రూంలో చెత్తాచెదారం లేకుండా చూడండి. భార్య భర్తల మధ్య విడదీయరాని అనుబంధం కోసం ఉత్తరం వైపు గోడపై రాధాకృష్ణులు ఆలింగనం చేసుకున్న ఫోటోను ఉంచండి. ఇలా పడకగది విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే భార్యాభర్తల మధ్య చిరాకులు తగ్గి వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications