vastu tips: అర్దరాత్రి పీడకలలతో నిద్ర పట్టకుంటే.. ఈ వాస్తు చిట్కాలు ట్రై చెయ్యండి!!
మనిషికి మంచి నిద్ర చాలా అవసరం. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే, ఈ రోజంతా ఆ వ్యక్తి బద్ధకం గానే ఉంటాడు. తగినంత నిద్ర లేకపోతే విపరీతమైన కోపం, చిరాకు వస్తాయి. సరైన నిద్ర లేకపోవడం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చాలామందికి నిద్రపట్టకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. కొంతమందికి అర్ధరాత్రి సమయంలో పీడకలలు రావడం, ఒక్కసారిగా మెలకువ రావడం, ఆపై నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
అయితే ఇటువంటి సమస్యలు ఉన్నవారు చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే నిద్ర సమస్యలు దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలామందికి భయం వల్ల నిద్రాభంగం కలుగుతుంది. అటువంటి వారు నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే, భయం కలగకుండా ఉండాలి అంటే యాలకలను దగ్గర పెట్టుకోవాలి. యాలుకలను దిండు కింద పెట్టుకోవడం వల్ల రాత్రిపూట భయపెట్టే పీడకలలు రాకుండా ఉంటాయి.

ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని ఆపై నిద్రపోవాలి. ఈ చిట్కా కూడా పీడకలలు రాకుండా చేస్తుంది. అంతేకాదు బెడ్ రూమ్ లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే దాని ప్రభావం వల్ల కూడా రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు మంచం పక్కన చెంబులో నీటిని ఉంచి, ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏవైనా మొక్కలకు పోయాలి.
ప్రతిరోజు చెంబుతో నీళ్ళు పెట్టుకోవడం వల్ల నిద్రా భంగం కలగకుండా ఉంటుంది. పీడకలలు రాకుండా ఉంటాయి. భయం సమస్యల నుండి బయట పడడానికి అవకాశం ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ నీటిలోకి చేరి మనపై ప్రభావం చూపించకుండా ఉంటుంది. ఇక చాలామందికి పడుకునే సమయంలో జుట్టు విరబోసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పడుకునేటప్పుడు కచ్చితంగా జుట్టు జడ వేసుకొని పడుకోవాలి. అంతేకాదు పడుకునే సమయంలో పాదాలు ఏ దిశలో పెట్టి పడుకున్నాము అనే విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశ నరకంగా పరిగణించబడుతుంది. కాబట్టి పొరపాటున కూడా దక్షిణ వైపు కాళ్ళు పెట్టి నిద్ర పోకూడదు. సరైన దిశలో నిద్రపోవడం వల్ల కూడా పీడకలలు రాకుండా ఉంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications