Vastu tips: పొరబాటున కూడా మెడిసిన్స్ ఈ దిశల్లో ఉంచకండి.. ఆరోగ్యంపై దుష్ప్రభావం!!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులను పెట్టుకోవడానికి మాత్రమే కాదు, మందులను పెట్టుకోవడానికి కూడా సరైన స్థలం ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఔషధాలను ఉంచే స్థలం వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో మందులు ఉంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. అందుకే ఇంట్లో మందులు పెట్టుకునే విషయంలో వాస్తు నియమాలను పాటించాలి.

చాలా మంది ఇంట్లో మందులను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు. మందులను పెట్టటం వంటి చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ అవే వాస్తు దోషాలకు కారణంగా మారతాయి. మందులను ఇంట్లో పెట్టటం కోసం కూడా వాస్తు దిశలున్నాయి.

Vastu tips: Vastu tips: Do not place medicines in these directions even by mistake.. Bad effect on health!!

ముఖ్యంగా ఇంట్లో మందులను ఉత్తర మరియు ఈశాన్య దిశలో పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఈ దిశలో మందులు పెట్టడం వల్ల సదరు రోగి త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మారడానికి వీలు ఉంటుంది. త్వరగా వ్యాధుల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ మరియు దక్షిణ దిశలలో మందులను పెట్టడం మంచిది కాదు.

దక్షిణదిశలో మందులు ఉంచినట్లయితే, కుటుంబ సభ్యులు చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా మందులపైన ఆధారపడతారు. అందుకే పొరపాటున కూడా దక్షిణ దిశలో మందులను ఉంచకూడదు. ఇక కొంతమంది మందులను వంట గదిలో పెడతారు. మందులు మాత్రమే కాకుండా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లను కూడా వంటగదిలోనే పెడతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో మందులు ఎప్పుడూ ఉండకూడదని చెబుతున్నారు.

అది వ్యక్తి ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. అంతేకాదు మందుల ప్రభావం కూడా బాగా తగ్గుతుందని చెబుతారు. వంటగదిలో, ఆగ్నేయంలో మందులను పెట్టడం వల్ల క్రమం తప్పకుండా మందులు వాడినా రోగి అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. మందులు పెట్టే విషయంలో మర్చిపోకుండా వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+