సింహరాశిలో శుక్రుడు అస్తమయం.. ఏ రాశుల వారికి ఎక్కువ కష్టాలో తెలుసా!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. సంపదకు, సంతోషానికి, లగ్జరీ కి ప్రతీకగా శుక్ర గ్రహాన్ని భావిస్తారు అటువంటి శుక్ర గ్రహం ఇప్పటికే తిరోగమనంలో ప్రయాణం చేస్తున్నాడు. అయితే శుక్రుడు ఆగస్టు 3వ తేదీన గురువారం నాడు రాత్రి 7.50 నిమిషాలకు సింహరాశిలో అస్తమించనున్నాడు. మళ్లీ 15 రోజుల తర్వాత ఆగస్టు 18వ తేదీన 7.40 నిమిషాలకు శుక్రుడు ఉదయించనున్నాడు.

అయితే శుక్రుడు అస్తమయం కొన్ని రాశుల వారిపై ఈ కాలంలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. వారు ఆర్థికపరమైన ఇబ్బందులను, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐదు రాశుల వారిపై శుక్రుడు అస్తమయ ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది.

Venus combust and sets in Leo.. Do you know which signs have negative impact!!

శుక్రుడు అస్తమయం మిధున రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రాశి వారి కెరీర్ తో పాటు, ప్రేమ జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులను చూస్తారు. గర్భిణీ స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీ భావాలను ఎవరితోనైనా వ్యక్తపరిచే ముందు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ కాలంలో కొంత నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది . ఖర్చులపై మీరు నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది.

శుక్రుడు అస్తమయ ప్రభావం కన్య రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి వారికి బంధువులతో కొన్ని గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది. వివాహ జీవితంలో ఇబ్బందులు, విద్యార్థులైతే చదువులో ఆటంకాలు, కుటుంబ సభ్యులతోనూ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ కూడా ఆశించినంతగా ఉండదు.

శుక్రుడు అస్తమయ ప్రభావం తులారాశి వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి కారణాలు లేకుండా గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. వీరు కెరీర్ పరంగా అనేక ఆటంకాలను ఎదుర్కోవచ్చు. కుటుంబంలో శాంతి సంతోషాలు లేకుండా పోతాయి.

శుక్రుడు అస్తమయ ప్రభావం మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యారంగంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ప్రేమకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు ఆకస్మిక ఆటంకాలను ఎదుర్కొంటారు.

శుక్రుడు అస్తమయం ప్రభావం ధనుస్సు రాశి వారిపై తీవ్రమైన ప్రతికూలతలను కలిగిస్తుంది. ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+