రేపటి నుండి శుక్రుడి దయతో నక్కతోక తొక్కే లక్కీ ఫెలోస్ వీరే!
సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు తన సంచార సమయంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తాడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు నవగ్రహాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ద్వాదశ రాశుల వారి జీవితాలలో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు.
శుక్ర సంచారం.. మాలవ్య రాజయోగం
అటువంటి శుక్రుడు జూన్ 29వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలో శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు అదృష్టాన్ని చూడబోతున్నారు. శుక్ర సంచారం కారణంగా నక్కతోక తొక్కే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవ్య మహా పురుష రాజయోగం మిధునరాశి జాతకులను కోటీశ్వరులుగా మారుస్తుంది. మిధునరాశి జాతకులు ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో పురోగతి సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. మిధున రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మిధునరాశి వారికి మద్దతు లభిస్తుంది. భూములు, ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది శుభ సమయం.
సింహరాశి
శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవ్య మహాపురుష రాజయోగం తో సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో చేసే ప్రతి పని వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పోటీ పరీక్షల కోసం కష్టపడే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు ఈ సమయంలో ఆర్థిక పురోగతి పొందుతారు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, వర్తకవ్యాపారాలు చేసే వారికి కూడా ఇది అదృష్ట సమయంగా చెప్పవచ్చు.
కన్యారాశిలో కుజ సంచారం... వీరిదే సంపన్న యోగం.. మీరున్నారా?
ధనుస్సు రాశి
జూన్ 29వ తేదీ నుంచి వృషభ రాశిలో శుక్ర సంచారంతో ఏర్పడే మాలవ్య మహా పురుష రాజయోగంతో ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి ధనుస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం వీరిని వరిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వీరు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications