జూన్ నుండి వీరికి అఖండ ధనయోగం.. మాట తప్పనన్న శుక్రుడు!

జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడును విలాసాలకు అధిపతిగా చెబుతారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. శుక్రుడు జాతకంలో శ్రేయస్సు ,సంపద, ఆనందం, కళలు వంటి వాటికి ప్రతీకగా చెబుతారు. అటువంటి శుక్రుడు సంవత్సరం తర్వాత మేష రాశిని వదిలి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.

శుక్ర సంచారం
శుక్రుడు జూన్ 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాలకు మేషరాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. వృషభ రాశిలోకి శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Venus said that he would soon give wealth to these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశిలోకి శుక్ర సంచారం వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. శుక్ర సంచారం వల్ల వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మిధున రాశి
మిధున రాశిలో శుక్ర సంచారం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది శుభ సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే బాగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

తులారాశి
శుక్ర సంచారం కారణంగా తులా రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వృషభ రాశిలో శుక్ర సంచారం తులా రాశి వారికి కలిసి వస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పెళ్ళికాని వారికి పెళ్లయ్యే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి
మకర రాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఇది లాభదాయకమైన సమయం.

మీనరాశి
శుక్ర సంచారం కారణంగా మీనరాశి జాతకులు అదృష్ట జాతకులు గా మారుతున్నారు. శుక్ర సంచారం మీన రాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి కచ్చితంగా కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+