శుక్రుడి కటాక్షంతో జులై 9నుండి ఈ రాశులవారికి సంపద వర్షం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి, ఒక నక్షత్రంలో నుండి మరొక నక్షత్రంలోనికి రవాణా అవుతూ ఉంటాయి. ఈ రవాణా అన్ని రాశుల వారి పైన గణనీయమైన ప్రభావాన్ని సూచిస్తుంది. ఇక సంపదలకు అధిపతి అయిన శుక్రుడు జులై 9వ తేదీన రాత్రి 9.44 నిమిషాలకు పుష్య నక్షత్రంలోనికి ప్రవేశించబోతున్నాడు.
పుష్య నక్షత్రంలో శుక్రుడు
జులై 20వ తేదీ వరకు శుక్రుడు పుష్య నక్షత్రంలోనే ఉంటాడు. ఈ కారణంగా జులై 20వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి సంపద వర్షం కురుస్తుంది. వారి జీవితం సుఖంగా ఉంటుంది. విలాసాలతో తులతూగుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
పుష్య నక్షత్రంలోనికి శుక్ర సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. నూతన ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి. పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలలో ఉన్న వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలు పెరుగుతాయి.
సింహరాశి
పుష్య నక్షత్రం లోకి శుక్రుడు ప్రవేశించటం వలన సింహరాశి జాతకులకు మేలు జరుగుతుంది. సింహరాశి జాతకులు చాలా కాలంగా వసూలు చేయలేకపోయిన డబ్బును తిరిగి వసూలు చేస్తారు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు పొందుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి
పుష్య నక్షత్రంలోకి శుక్ర సంచారం కారణంగా మకర రాశి జాతకులకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. వర్ధక వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా బలంగా పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారు కూడా కెరీర్లో పురోగతిని సాధిస్తారు. జీవితంలో అనుకున్నవన్నీ సాధించడానికి ఇది సరైన సమయం. లగ్జరీగా లైఫ్ ను గడుపుతారు. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఏ రంగంలో పనిచేసినా తప్పక విజయాలు సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications