ధనుస్సు రాశిలో శుక్ర సంచారం నేడే.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు; మీరున్నారా!!
గ్రహాలలో ముఖ్య గ్రహమైన శుక్ర గ్రహం నేడు ధనుస్సు రాశి లోకి మారుతుంది. ధనుస్సు రాశిలో శుక్ర గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అయితే 6 రాశుల వారికి ధనుస్సు రాశిలో శుక్ర గ్రహ రవాణా భారీగా ప్రయోజనాలను కలిగిస్తుంది.
ధనుస్సు రాశిలోకి శుక్రుడు నేడే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 18వ తేదీన అంటే నేటి రాత్రి 8 గంటల 56 నిమిషాలకు ధనుస్సు రాశి లోకి ప్రవేశించి ఆపై జనవరి 29వ తేదీన పూర్వాషాడ నక్షత్రం లోకి ప్రవేశిస్తారు. దీని తర్వాత శుక్రుడు 2024 ఫిబ్రవరి 12వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ శుక్ర సంచారం ముఖ్యంగా ఆరు రాశుల వారికి గణనీయమైన ఫలితాలను అందిస్తుంది.

మేషరాశి
శుక్ర సంచారం వల్ల మేష రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మీ అదృష్టం మరింత పెరుగుతుంది. ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. మేష రాశి వారు కుటుంబం నుండి పూర్తిగా మద్దతును పొందుతారు. ఆర్థికంగా అన్ని విషయాలను ప్రయోజనకరంగా ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి వారు శుక్ర సంచార సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మిధున రాశి వారి జీవితంలో శుక్ర సంచారం ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది.
సింహరాశి
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం సింహ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. వ్యాపార రంగంలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితంలో కూడా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా పని చేసే చోట ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ మద్దతు ఈ సమయంలో సింహరాశి వారికి లభిస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ధనుస్సు రాశిలో శుక్ర సంచారం ఆర్ధిక ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవం గణనీయంగా పెరుగుతుంది. ఆర్ధికంగా అన్ని రంగాలలో ప్రయోజనంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం వలన ధనుస్సు రాశి వారి జీవితంలో అదృష్టం ప్రకాశిస్తుంది. చాలా కాలం నుండి వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. ధనుస్సు రాశిలో శుక్ర సంచారం ఆర్ధిక లాభాలను ఇస్తుంది. అన్నింటా విజయం సాధించేలా చేస్తుంది.
కుంభరాశి
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా కుంభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కుంభరాశి వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. పని చేసే చోట ఆర్ధిక లాభాలను పొందుతారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications