weekly horoscope: ఈ రాశుల వారికి ఈ వారమంతా అవధుల్లేని సంతోషం!!
మీ జాతకం ఎలా ఉంది? జీవితం ఎలా సాగుతుంది? ఈ వారం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి? వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికి చాలామందిలో ఉత్సాహం ఉంటుంది. ద్వాదశ రాశులలో చాలా రాశులకు గ్రహాల సంచారం వల్ల అనుకూల, అననుకూల ఫలితాలు ఉంటాయి.
అన్ని రాశులకు మొత్తం చెడు, మొత్తం మంచి జరిగే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉండవు. మిశ్రమ ఫలితాలను కూడా చూడాల్సి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరు ఈ వారం మన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలని కోరుకుంటారు కాబట్టి జులై 17 నుండి జులై 23 వరకు వివిధ రాశుల వారి జీవితంలో అవధుల్లేని సంతోషం అనుభవించే రాశులను గురించి చెప్పుకుందాం.

మేష రాశిలో పంచమ స్థానం నందు కుజుడు శుక్రుడు ప్రభావం వల్ల సంతాన సౌఖ్యం కలుగుతుంది.పిల్లలతో మేషరాశి వారు సంతోషంగా గడుపుతారు. శని అనుకూల పరిస్థితి వల్ల ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారం కుటుంబంతో మేషరాశి వారు అవధులు లేని ఆనందాన్ని అనుభవిస్తారు.
ఇక వృషభ రాశి వారికి కూడా తృతీయ స్థానం నందు రవి, బుధుల సంచారం వల్ల ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. మిధున రాశి జాతకులు కూడా ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మిధున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేస్తారు.
సింహ రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉన్నప్పటికీ వినోదాలకు, విలాసాలకు, నూతన వస్త్రాలు, వస్తువుల కొనుగోలుకు బాగా డబ్బులు ఖర్చు చేసి ఎంజాయ్ చేస్తారు. మీన రాశి వారికి ఈ వారం ధనలాభం, సౌఖ్యం కలుగుతాయి . కుటుంబ సభ్యులతో వీరు ఆహ్లాదంగా గడుపుతారు.
వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. భాగ్యమునందు రవి, బుధుల ప్రభావం చేత కుటుంబ సభ్యులతో వారు ఆనందంగా గడుపుతారు. దశమ స్థానం నందు కుజ శుక్రుల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కలిసొస్తుంది.
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. లాభ స్థానం నందు రవి, బుధుడు ప్రభావం చేత అన్ని విధాల లాభం కలుగుతుంది. వ్యయ స్థానమందు కుజుడు, శుక్రుడు ప్రభావం చేత సౌఖ్యం, ధన వ్యయం కలుగుతుంది. ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications