weekly horoscope: ఈ వారం తులారాశి నుండి మీనరాశి వరకు.. అనుకూలతలు.. ప్రతికూలతలు!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మానవ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలు ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి మారుతున్న సమయంలో ద్వాదశ రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి. గ్రహాల పరివర్తన, గ్రహాల తిరోగమనం, గ్రహాల అస్తమయం వివిధ రాశి జాతకుల పైన రకరకాలుగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

ఇక ఈ వారం జులై 31వ తేదీ నుండి ఆగస్టు 6 వరకు ఈ వారంలో తులా రాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తులా వారికి ఈ వారం ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మీరు ఆకస్మిక లాభాలను, లాభదాయకమైన అవకాశాలను అందుకోవచ్చు.

weekly horoscope: This week from libra to pisces these are the main advantages and dis advantages!!

తులా రాశి వారికి ఈ వారం ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈవారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపార జీవితంలో కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్త .

వృశ్చిక రాశి వారు ఈ వారం ఆర్థిక విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితంలో కొన్ని భావోద్వేగా పరిస్థితులు కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారి వృత్తి జీవితం ఈవారం కాస్త బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు కెరీర్లో పురోగతిని సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఈవారం విద్యార్థులు ఒత్తిడిని అనుభవిస్తారు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యంపైన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఈ వారం వృత్తి వ్యాపారాల పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించుకోవడం ధనుస్సు రాశి వారికి అవసరమని సూచించబడింది. ధనుస్సు రాశి వారు ఆరోగ్యం పట్ల ఈ వారం జాగ్రత్త వహించాలి.

మకర రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత స్థిరత్వాన్ని సానుకూల అభివృద్ధిని కలిగిస్తుంది. ఆదాయంలో కాస్త పెరుగుదల కనిపిస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ భాగస్వామితో మరింత ప్రేమగా ఈ వారం వ్యవహరించే అవకాశం ఉంది. వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ప్రగతి కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ జీవన శైలిని మార్చుకోవడానికి మంచి సమయమని చెప్పబడింది.

కుంభ రాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పై దృష్టి పెట్టాలని సూచించబడింది. హఠాత్తుగా విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆర్థిక విషయాలలో తెలివిగా, ఆచరణాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వృత్తిపరమైన పురోగతి ఈవారం కనిపిస్తుంది. కుంభ రాశి వారు ఈ వారం మీ శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

ఈ వారం మీనరాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తిపరంగా మీన రాశి వారు ఈ వారం మీలోని సృజనాత్మకతను ఉపయోగించుకోవడం ఎంతో అవసరం. విద్యా ప్రయత్నాలలో విజయం సాధించాలనుకునే వారు అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ వారం విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ వారం ప్రయత్నం చేయాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+