• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ సహస్ర చండీ యాగం: యాగలు, హోమాల వల్ల ఫలితాలు ఉంటాయా, ఏమిటి?

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 21వ తేదీ నుంచి మరోసారి యాగం నిర్వహించనున్నారు. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాగం ఏమిటి, ఈ యాగ ఫలితాలు ఏమిటో చూద్దాం.

దేవాన్భావ యతానేనతే దేవా భావయంతు వ:

పరస్పరం భావయన్త: శ్రేయ: పరమవాప్స్యథ.

యజ్ఞ యాగాలు చేయడం వలన దేవతలు సంతృప్తి చెంది ఆ యజ్ఞ యాగాదులు చేసిన ఫలితంగా మన జీవితంలో మనకు కావలసిన కోరికలను నేరవేస్తూ మన జాతకంలో ఉన్న గ్రహదోషాలను తొలగించి జీవితంలో సుఖశాంతులను పొందుటకు ఈ యాగాలు హోమాలు ఉపయోగపడతాయి.

యజ్ఞయాగాలు అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం! మనకున్న ఎలాంటి కోరికలు అయినా నెరవేర్చుకోవాలని భావిస్తే దానికి సంబంధించి వివరాలకోరకు పండితులను సంప్రదిస్తే అన్ని సమస్యల నుండి విముక్తి కలిగించి కోరిన కోర్కేలను తీర్చేది కేవలం చండీ యాగం అని సూచన చేస్తూ ఉంటారు.

ఏమిటీ హోమం దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఎవరీ చండీ?

ఏమిటీ హోమం దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఎవరీ చండీ?

చండీ అంటే 'తీవ్రమైన' అన్న అర్థం వస్తుంది. అందుకే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చండి అవతారాన్ని ధరించిందని తెలియజేయబడినది.

జగన్మాత చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. వృద్ధి చెందడానికి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి , క్రియాశక్తి, కుండలినీ శక్తి అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాలలో చండీ రూపం ఒకటి.

చండీదేవి తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది. చండీ దేవి, చాముండీదేవినీ కొలిచేందుకు మనదేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి.

జగన్మాతను ఆరాధించడం ఆనవాయితీ

జగన్మాతను ఆరాధించడం ఆనవాయితీ

లోకకల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీ విద్య లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు.

బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే మార్కండేయ పురాణం.. చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను విహరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

చండీ సప్తశతి

చండీ సప్తశతి

కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం. చండీయాగం మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గా సప్తశతి అంటారు. దీనికే చండీ సప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది.

ఒక చండీ హోమంలో ఉన్న మంత్రాలు మరియు అధ్యాయాలు చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు అర్థశ్లోక త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమరి, భ్రామరీ అనే ఏడుగురు దేవతా మూర్తులకు సప్తసతులు అని పేరు.

వారి మహత్య వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనుక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి.

 మూడు పద్ధతుల్లో సప్తశతి

మూడు పద్ధతుల్లో సప్తశతి

సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు.

దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వ జనుల హితం కోసం పర బ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. కలి యుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం.

ఇదీ చండీ హోమం

ఇదీ చండీ హోమం

ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి,హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవచండీ యాగం చేస్తే అమితమైన ఫలం వస్తుందని పెద్దలు చెబుతారు.

ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మనుచండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు.

ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు. వీటిలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు.

యాగాలు ఎందుకు చేస్తారంటే

యాగాలు ఎందుకు చేస్తారంటే

చండీ దేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గా సప్తశతిని వల్లెవేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు. పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ శత్రువులపై విజయం సాధించాలనీ.... చండీయాగం చేసేవారు.

యజ్ఞార్ధాత్ కర్మణోన్యత్ర లోకో యం కర్మ బంధన:

తదర్ధం కర్మ కౌంతేయ ముక్త సజ్గ్: సమాచర.

కేవలం యజ్ఞ యాగాదులనే కాక ఇతర లోకహిత కర్మలు చేస్తేనే మంచి బంధాలు ఫలితాలు ఏర్పడతాయి. మనకు రాచరికాలు పోయినా చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు.

యజ్ఞయాగాదులు చేయుటకు తన సంపాదనలోని డబ్బులు ఖర్చు చేస్తే ఫలితం అమోగంగా ఉంటుంది. అందుకే భగద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటారు ఈ సృష్టిలో నేనే యజ్ఞమునై ఉన్నాను అంటారు. యజ్ఞం అంటే కామదేనువు లాంటిది. అందుకే ఈ పూజా ఫలంతో మానవుని భౌతికంగా, సంపద సమృద్ధి, విజ్ఞాన సమృద్ధి వికసించును. సకల సంపదలతో పాటు ఆత్మోన్నతి కలిగి అంత్యంత అనంద సుఖ విలాసాలను కలిగిస్తుంది.

స్థోమత కలిగిన వారు యాగం చేస్తారు

స్థోమత కలిగిన వారు యాగం చేస్తారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి యజ్ఞ యాగాల పైన అమిత నమ్మకం, గౌరవంతో నిష్టతో చేస్తూ అఖండ ప్రజాదరణ, శత్రు విజయం, కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతున్న విషయం మన మందరం చూస్తోందే. స్థోమత కలిగిన వారు ఎవరైన వారికున్న సమస్యల నివారణ కొరకు మరియు అన్ని విధములుగా శక్తి సామర్ధ్యాలను పొందడానికి ఈ యాగం చేస్తుంటారు.

గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమంటే... ఎవరైతే ఈ చండీయాగం చేయలని సంకల్పిస్తారో వారు వారి కుటుంబ సభ్యులు ప్రశాంతమైన మనస్సుతో సంకల్ప బలంతో క్రతువు చేసి అన్న ప్రసాదము వితరణ గావిస్తే తప్పక అమ్మ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. దీనికి భక్తి శ్రద్ధలతో పాటు పూర్తి విశ్వసం కలిగి నిష్టతో చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ.

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to Hindu mythology many type puja and Sahasra Chandi Yagna is a best pooja for Supreme Shakthi Durga.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more