vastu tips: ఇంట్లో రాక్షస స్థానం ఏది? అక్కడ టాయిలెట్స్ ఉంటే ఏమవుతుంది?
ఇంటి నిర్మించుకునేటప్పుడు ఇంటి యొక్క దిశలను తెలుసుకోవడం, వాస్తు ప్రకారం ఇంటి నిర్మించుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో ఏ దిశకు ఎవరు అధిపతి? ఎక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి? వంటి అనేక అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఈశాన్య దిశను దేవతల స్థానంగా చెప్పకుంటే, అత్యంత డేంజరస్ గా రాక్షస స్థానం ఉంటుందని చెబుతున్నారు.
ఇంట్లో రాక్షస స్థానం అంటే ఏంటి? అది ఏ దిశలో ఉంటుంది అక్కడ ఏం చేయొచ్చు ? ఏం చేయకూడదు వంటి వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఇంట్లో నైరుతి దిశను రాక్షస స్థానంగా చెబుతారు. నైరుతి దిశలో అసురులు నివసిస్తారని, మరణించిన పూర్వీకులు నివసిస్తారు అని చెబుతారు. నైరుతి దిశకు రాహువు అధిపతి. కాబట్టి దీనిని అత్యంత డేంజరస్ దిశగా చెబుతూ ఉంటారు.

అయితే ఈ దిశలో ఇటీవలి కాలంలో కొందరు వాస్తుశాస్త్ర నిపుణులు టాయిలెట్స్ కట్టొచ్చు అని సూచిస్తున్నారు. చెడుదిశ కాబట్టి టాయిలెట్స్ నిర్మాణం తప్పేమీ కాదని చెప్తున్నారు. కానీ చాలా మంది మాత్రం ఈ దిశలో టాయిలెట్స్ కట్టడం డేంజర్ అని చెబుతున్నారు. ఈ దిశలో నీటిప్రవాహం నిషేధించబడింది అని, టాయిలెట్ నిర్మాణం జరిగితే టాయిలెట్ల ద్వారా నీళ్లు ప్రవహిస్తాయని కాబట్టి ఈ దిశలో టాయిలెట్ వుండటం మంచిది కాదని చెబుతున్నారు.
నైరుతి దిశలో టాయిలెట్ ఉంటే టాయిలెట్ లో నిల్వ ఉండే నీటి వల్ల అసుర శక్తులు ఇంట్లోని వారిపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇక ఆ ప్రభావం ఒక్కోసారి మూడేళ్ల లోపు ఉంటుందని, కొన్ని సమయాలలో ఏడేళ్ల లోపు, లేదంటే పదిహేను సంవత్సరాల తర్వాత కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా నైరుతిదిశలో టాయిలెట్స్ కట్టడం మంచిది కాదని చెబుతున్నారు.
అంతేకాదు ఈశాన్య దిశలో దేవతల స్థానం నుంచి ఇంట్లోకి వచ్చే కిరణాలు, నైరుతి దిశలో టాయిలెట్స్ ఉంటే నిర్వీర్యం అవుతాయని, వాటి సానుకూల శక్తి నశిస్తుందని చెబుతున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఎవరు ఇంట్లో నైరుతి దిశలో టాయిలెట్స్ కట్టుకోకూడదు. రాక్షస స్థానమైన నైరుతిదిశలో టాయిలెట్స్ నిర్మిస్తే చాలా దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు.
ఆ కుటుంబ సభ్యుల పై రాహువు ప్రభావం ఉంటుందని, ఎప్పటికీ ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయని, కుటుంబములో సుఖశాంతులు లోపిస్తాయి అని చెబుతున్నారు. కాబట్టి రాక్షస స్థానమైన నైరుతిదిశలో టాయిలెట్ నిర్మాణం ఏ మాత్రం మంచిది కాదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications