కేతువు కటాక్షంతో ఈ రాశులవారికి జాక్ పాట్!
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం కేతువును చెడుచేసే గ్రహంగా, పాప గ్రహంగా భావిస్తారు. సాధారణంగా కేతువు ఎవరికి మేలు చేయనప్పటికీ ప్రస్తుతం కేతువు కన్యరాశిలో శుభఫలితాలను ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. శుక్రుడు, బుధుడు, గురువు కేతువును వీక్షించడం వల్ల ఈనెల 28వ తేదీనుంచి కేతువు శుభఫలితాలను ఇవ్వబోతున్నాడు. కేతువు కారణంగా అదృష్టాన్ని పొందే రాశులగురించి తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశిలో ఆరవ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమయంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పదోన్నతులు వస్తాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో మూడవ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగాల ప్రయత్నాలు చేసేవారు పెళ్లి ప్రయత్నం చేసేవారు లబ్ధిని పొందుతారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
కన్యారాశి
కన్య రాశిలో కేతువు సంచారం కారణంగా వీరి జీవితంలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. ఏ పని చేసిన ఈ సమయంలో సఫలం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులు సంపన్న వర్గాలతో సంబంధాలు ఏర్పడి భవిష్యత్తుకు ఈ సంబంధాలు ఉపయోగపడతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో లాభ స్థానంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగాలలోను సామాజికంగానూ వీరికి గుర్తింపు వస్తుంది. వృశ్చిక రాశి వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి రాబడి పెరుగుతుంది. మీరు శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశిలో దశమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి.
మకర రాశి
మకర రాశిలో భాగ్య స్థానంలో కేతువు సంచారం చేయడం వల్ల విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆదాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వివాహాల విషయంలో శుభవార్తలు వింటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications