25న పుష్య పౌర్ణమి: ఈ పనులు అస్సలే చెయ్యొద్దు; దరిద్రం వస్తుంది!!
పుష్య పూర్ణిమనాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చేయవలసిన కొన్ని పనులను గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనులను గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. తెలిసి తెలియక కొన్ని పనులను చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాకపోగా, ప్రతికూల ఫలితాలు వస్తాయి. దరిద్ర లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుంది.
కాబట్టి పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతి నెల శుక్ల పక్షంలోని చతుర్దశి తిథి తర్వాత వచ్చే రోజును పుష్య పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈసారి పుష్య పౌర్ణమి జనవరి 25వ తేదీన వస్తుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించి, ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మి కటాక్షం ఉంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

పుష్య పౌర్ణమి నాడు గంగా స్నానం తో పాటు జపం, దానధర్మాలు మంచిదని చెబుతున్నారు. హిందువుల విశ్వాసం ప్రకారం లోకరక్షకుడైన విష్ణుమూర్తి, తల్లి లక్ష్మీదేవిని ఈరోజు పూజించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని, కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అయితే పుష్య పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు.
పుష్య పౌర్ణమి రోజు పొరపాటున కూడా మద్యపానాన్ని, మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఇలా చేస్తే జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి. పుష్య పౌర్ణమి నాడు జీవిత భాగస్వామితో గొడవలు పడటం మానుకోవాలి. జీవిత భాగస్వామితో గొడవలు పడటం వల్ల మీకు అనర్ధాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున, ఇంటికి వచ్చిన ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపించకూడదు.
సహాయం కోసం మీ ఇంటికి వచ్చిన వారికి మీకు తోచిన మేరకు ఏదో ఒకటి దానం చేసి పంపించాలి. పుష్య పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరించడం అశుభం. ఇలా చేయడం వల్ల జీవితంలో నెగెటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు. పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా పెద్దలను అవమానించవద్దు. ఏ స్త్రీతోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు. ఇలా చేయడం వల్ల పితృ దోషం వస్తుందని చెప్తారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications