వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్యా రాశి ఫలాలు 2017 సంవత్సరం ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం

ఉతర 284 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1.2 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము టో, పా, పి, పూ, షం, ణా, రా, పే, పో అను అక్షరములలో ఒకటి అయినచో మీది కన్యారాశి.

By Ankam Maruthi
|
Google Oneindia TeluguNews

ఉతర 284 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1.2 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము టో, పా, పి, పూ, షం, ణా, రా, పే, పో అను అక్షరములలో ఒకటి అయినచో మీది కన్యారాశి.

తుల రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

Virgo

1) 2017 జనవరి:

వ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధననష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనములు, దైవ కార్యములలో పాల్గొనుట, ఇంటికి సంబంధించిన వస్తువులు సమకూర్చుకొనుట, చేయు వృత్తి వ్యాపారములలో ధనలాభము పొందుట, పరిస్థితులు చక్కబడుట, ఇతరులు చెప్పిన చాడీల వలన కుటుంబ తగాదాలు, పంతాలు, పందెములు వేయుట వలన నష్టపోవుట జరుగును.

2) ఫిబ్రవరి:

ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది. తలంచిన కార్యములు జయము, సగములో నిలిచిపోయిన పనులు చేయుట, సంతానాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, నూతన వ్యక్తులతో పరిచయములు, విద్యాభివృద్ధి, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధు సమాగమము, అన్ని రంగముల వారికి ధనాదాయము బాగుండుట, శారీరక శ్రమ.

3) మార్చి:

చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, ఆలస్యము విూద పనులు నెరవేరుట, నూతన వ్యాపార ప్రయత్నములు ఫలించుట, ధనలాభం, ఎంత సంపాదించినా నిలపడకపోవుట, ఆదాయమునకు మించిన ఖర్చులు, ఇతరులచే విమర్శలకు గురి అవుట, కొత్త ఆలోచనలు, కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు విజయవంతమగును. విసుగుదల హెచ్చును. కురుపులు, గాయములు, దెబ్బలు తగులుట.

4) ఏప్రియల్:

దూర ప్రయాణములు చేస్తారు, అవమానం పొందుతారు, అధికారుల కోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి నమ్మిన వారి వలన మోసములు, ఉత్సాహము లేకుండుట, అనారోగ్యం, భార్యకు, సంతానమునకు పీడ, మాటామాటా పట్టింపులు, విరోధములు, మనస్థాపము, వేళకు సరిగా భోజనము చేయలేకపోవుట, తలంచిన పనులకు ఆటంకము, భయాందోళనలు, స్త్రీలతో విరోధములు, ఏదో రూపేణా సౌమ్మ వసూలగుట.

5) మే:

ఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, శతృవృద్ధి, అశుభవార్తలు వినుట, అధికారులతో విరోధము, చేతిక్రింద పనిచేయువారల వలన మాటలు పడుట, ప్రమోషన్లకు ఆటంకములు, తరచు ప్రయాణములు, ఇంటిపట్టున వుండకపోవుట, సుఖ సౌఖ్యములు లేకపోవుట, వృత్తి - వ్యాపారములందు లేక అంతంత మాత్రముగా నుండును. ఊహించినంత సొమ్ము చేతికి రాదు.

6) జూన్:

ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్తి నష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చు పెడతారు. తలంచిన కార్యములు జయము, చేయు కృషి వృద్ధిగా వుండుట, గవర్నమెంటు వారి వలన జరగవలసిన పనులు కష్టము విూద నెరవేరుట, బిల్లలు సకాలములో వసూలు కాకపోవుట, నూతన వ్యక్తులతో స్నేహము, పాత బాకీలు వసూలగుట, చురుకుదనము లేకపోవుట, ధనము కలిసి వచ్చుట, ప్రయాణములకు ఆటంకములు.

7) జూలై:

మిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, సంఘములో గౌరవము, పలుకుబడి, వృత్తి వ్యాపారములలో కలిసివచ్చుట, ధనలాభం, అధికారుల వలన ఉపకార లాభములు పొందుట, ఉద్యోగాభివృద్ధి, శతృవులు మిత్రులగుట, కుటుంబ సౌఖ్యము, భార్యతోను, పిల్లలతోను ఆనందముగా గడుపుట, సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి గౌరవము, పలుకుబడి, ధనాదాయం బాగుండును. ఆరోగ్యం చేకూరును.

8) ఆగష్టు:

గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును. గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్రులు కలియుట, విందు వినోదములలో పాల్గొనుట, రావలసిన సొమ్ము వసూలగుట, ప్రేలుడు పదార్ధముల వలన కాళ్ళకు- చేతులకు దెబ్బలు తగులుట, అనారోగ్యం, వైద్యము కొరకు ధనము ఖర్చు చేయుట, ఆలస్యము మీద పనులు నెరవేరుట, అనవసర ధనవ్యయం.

9) సెప్టెంబరు:

దశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, బంధు మిత్రులతో కలహములు, శిరస్సుకు సంబంధించిన బాధలు, జాయింటుదారులతో మనస్పర్ధలు, అపనిందలు, మాటలు పడుట, మాటామాటా పట్టింపులు, వాదోపవాదములు, వేళకు భోజనమ లేకపోవుట, మనస్సుకు స్థిమితము లేకపోవుట, ధననష్టం, నూతన బంధు మిత్రులతో స్నేహ లాభములు పొందుట, ఎత్తు నుండి జారిపడుట, దెబ్బలు తగులుట.

10) అక్టోబరు:


దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును. చంచల మనస్సు చేయు పనులలో నిశ్చితాభిప్రాయము లేకుండుట, దుష్ట సహవాసములు, వ్యసనములకు లోబడుట, స్నేహితులతోను, బంధువులతోను అనవసర కలహములు, మాట పట్టింపులు, ధనవ్యయం, వ్యాపార వ్యవహారములలో కలిసిరాకపోవుట, దైవకార్యములు, సభలు, సమావేశములలో పాల్గొనుట వలన గౌరవము, పలుకుబడి కలుగును. వ్యవసాయదారులకు లాభించును.

11) నవంబరు :

దశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, అధికారుల వలన భయం, అన్నదమ్ములు, అప్పచెల్లెండ్రు, బంధు మిత్రులతో సఖ్యత లేకపోవుట, స్త్రీ సౌఖ్యము, విలువైన వస్తు వస్రాభరణ ప్రాప్తి, మనస్సుకు స్థిమితము లేకపోవుట, సంగీత సాహిత్యముల యందు ఆసక్తి, ఏదో ఒక రకముగా సొమ్ము చేతికి వచ్చుట, చర్మ సంబంధమైన వ్యాధులు, అనారోగ్యం, ధనవ్యయం.

12) డిశంబరు:

దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగ మందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును. సంఘములో గౌరవము, పలుకుబడి, తల్లిదండ్రులు - పూర్వీకుల ఆస్తులు కలియుట, ధనలాభము, కుటుంబసౌఖ్యం, చంచల మనస్సు, వృత్తి - వ్యాపార - వ్యవహారములందు లాభం, అధికారుల వలన ఉపకార లాభములు పొందుట, ఉద్యోగాభివృద్ధి, ఆఫీసులకు వెళ్ళే వారికి పనులు నెరవేరుట, పెనన్లు పొందుట, ప్రయాణములు, ఒళ్ళునొప్పలు, అనారోగ్యం.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in Telugu. Get the complete year prediction for 2017. Year prediction of Virgo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X