న్యూఢిల్లీ: 15వ లోక్ సభ సభ్యులుగా రాష్ట్రం నుంచి ఎన్నికైన టీఆర్ ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు (మహబూబ్ నగర్), విజయశాంతి (మెదక్)లు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కెసిఆర్ తెలుగులో, విజయశాంతి ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. వర్ణమాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎన్నికైన సభ్యులంతా నిన్ననే ప్రమాణస్వీకారం చేశారు. అయితే కెసిఆర్, విజయశాంతి హాజరు కాకపోవడంతో వారు ఈరోజు సభా సభ్యులగా ప్రమాణం చేశారు.
వీరితో పాటు అనకాపల్లి లోక్ సభ ఎంపీ సబ్బంహరి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు(కాంగ్రెస్)లు కూడా ప్రమాణం చేశారు. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, జయప్రద(ఎస్పీ), అజరుద్దీన్(కాంగ్రెస్), మేనకగాంధీ(బీజేపీ), వరుణ్ గాంధీ(బీజేపీ) తదితరులు ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు.