హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ అన్నారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఆయన రోశయ్యతో బేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కెసిఆర్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెసు పార్టీ చాలా సార్లు కట్టుబడి ఉంటామని చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెసుకు ఓటేశారని ఆయన అన్నారు. ఆ నమ్మకాన్ని కాంగ్రెసు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అజిత్ ఆదివారం రాత్రి కెసిఆర్ ను పరామర్శించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఆయన అన్నారు.