వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ డిఐజి శ్రీనివాసరెడ్డిపై రాజకీయ నీలినీడలు?

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్‌ రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) ఆఫ్‌ పోలీసుగా నియమితులైన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఎనిమిది రోజులవుతున్నా ఆయన విధుల్లో చేరకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఎస్పీగా ఉక్కుపాదం మోపి అనతికాలంలోనే బదిలీ అయిన ఆయన ఇక్కడకు రాకుండా అధికార పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. గతంలో ఆయన ఇక్కడ ఎస్పీగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యే కొండా సురేఖతో విభేదాలు వచ్చాయి.

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అడిషనల్‌ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆయనను వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా నియమిస్తూ ఈ నెల 2న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎనిమిది రోజులు గడుస్తున్న విధుల్లో చేరకపోవడం చర్చనీయాంశం అవుతోంది. వ్యక్తిగత పనుల కోసం ఆయన సెలవు పెట్టారన్న ప్రచారం జరుగుతుండగా, కొందరు ప్రముఖులు ఆయన రాకను అడ్డుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 1994వ బ్యాచ్‌కు చెందిన కె.శ్రీనివాస్‌రెడ్డి 2004 జూన్‌ 21న వరంగల్‌ జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. పనిచేసింది ఆరు మాసాలే అయినా సిబ్బంది, ప్రజల ప్రశంసలు అందుకున్నారు.

ల్యాండ్‌ మాఫియా, రౌడీయిజంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన స్కిల్‌గేమ్‌ పేరిట వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడటానికి కారణమైన పేకాట క్లబ్‌లను మూసి వేయించారు. ఇది మింగుడుపడని కొందరు శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేయించారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా ఆయన్ను ఇక్కడినుంచి బదిలీ చేయించడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయనే స్వచ్ఛందంగా ఓరుగల్లు పోస్టింగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నారా? లేదా సెలవుల తర్వాత విధుల్లో చేరుతారా? అన్న అంశాలపై అన్ని వర్గాల్లో చర్చ సాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X