వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎఫ్ ఐఎ భవనంపై దాడి: పలువురు మృతి

ఈ సంఘటనలో భారీ విధ్వంసం జరిగింది. ఇటీవలి కాలంలో అదే అతి పెద్ద దాడి అని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు వచ్చాయి. ఎఫ్ఐఎ భవనానికి సమీపంలోని మోడల్ టవున్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని, సంఘటన స్వభావాన్ని, మరణాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని పోలీసు అధికారి మొహమ్మద్ రియాజ్ చెప్పారు.
పేలుడు పదార్ధాలతో కూడిన కారను నడుపుకుంటూ వచ్చి ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఎ భవనం పాక్షికంగా దెబ్బ తిన్నది. సంఘటనా స్థలంలో ఇటుకల కుప్పలు, మెటల్ పడి ఉన్నాయి. సమీపంలోని భవనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఈ దాడికి పాల్పడిందెవరనేది తెలియడం లేదు.