తుఫాను: పలు రైళ్లు రద్దు

కోస్తా జిల్లాలకు వెళ్లే 31 ప్యాసింజర్ రైళ్లను గురువారం, శుక్రవారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తుఫాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున రైళ్ల వేగాన్ని 60 కిలోమీటర్లకు తగ్గించాల్సిందిగా ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం ఉదయం 32 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రైల్వే ట్రాక్ పై నీళ్లు నిలిచాయి. పలు రైళ్లను స్టేషనులోనే నిలిపేశారు.












Click it and Unblock the Notifications