హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిసి నేత కృష్ణయ్య ఆమరణ దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Krishnaiah
హైదరాబాద్‌: బీసీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులు, బోధనా ఫీజులను తక్షణమే చెల్లించాలని కోరుతూ శుక్రవారం ఉదయం ఆర్‌.కృష్ణయ్య ప్రారంభించిన ఆమరణ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. శుక్రవారం ఉదయం 11.15 గంటలకే ఆయన బీసీభవన్‌లో దీక్షను ప్రారంభించిన విషయ తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డాక్టర్లు ప్రకటించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సకు నిరాకరించిన కృష్ణయ్య ఆసుపత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. కృష్ణయ్య చికిత్స పొందేందుకు అంగీకరించడం లేదని గాంధీ ఆసుపత్రి ఆర్‌ఎంఓ విజయలక్ష్మి తెలిపారు. ఆయన శరీరంలో చెక్కర స్థాయి తగ్గిపోతోందని, రక్తపోటు పెరుగుతోందని తెలిపారు. సైలెన్‌ ఎక్కించుకునేందుకు ఆయన అంగీకరించడం లేదన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఐసీయూలో రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కృష్ణయ్యను రాత్రి పదిగంటల అనంతరం ప్రత్యేక గదికి తరలించారు.

కృష్ణయ్యను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో బీసీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాయకులకూ, పోలీసులకూ తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొందరికి గాయాలయ్యాయి. తోపులాట కారణంగా ఓ నేత ఏకంగా స్పృహ కోల్పోయాడు. అతన్ని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మహిళా నాయకులని కూడా చూడకుండా దొరికిన వాళ్లని దొరికినట్లు పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. బీసీభవన్‌లో శుక్రవారం ఉదయం దీక్షను ప్రారంభించిన కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక ధోరణిపై విరుచుకుపడ్డారు. బోధనాఫీజులను పూర్తిగా చెల్లించే వరకూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముమ్మాటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మార్చి 31న బలహీనవర్గాల విద్యార్థుల బిల్లుల కోసం రూ.600 కోట్ల విడుదలకు ఆదేశాలు జారీచేసి చివరి నిమిషంలో నిలిపివేశారన్నారు.

బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించనందుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎర్రసత్యంలు తెలిపారు. వేల సంఖ్యలో విద్యార్థులతో కలసి రాష్ట్ర, జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహిస్తామని చెప్పారు. ఆర్‌.కృష్ణయ్యను అరెస్టు చేసి దీక్షను భగ్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నిరసనగా బీసీ యువజన సంఘం, ఈబీసీ సంక్షేమ సంఘం ఖండించాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఆర్‌.కృష్ణయ్య పెట్టిన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తామని బీసీ యువజన సంఘం అధ్యక్షులు జె.శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X