హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండు హత్య కేసు: మహేందర్ రెడ్డి వెనక ఉన్నదెవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
హైదరాబాద్: తెలుగుదేశం నాయకుడు చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు అనుచరుడు మహేందర్ రెడ్డి వెనక ఉన్నదెవరనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేశారు. పండును మహేందర్ రెడ్డే హత్య చేసి ఉంటాడని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. హత్య కేసు నిందితులను గుర్తించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. కాసేపట్లో నిందితులను పట్టుకుంటామని ఆయన చెప్పారు. హత్య జరిగిన స్వప్నిక్ అపార్టుమెంటును ఆయన సోమవారం ఉదయం సందర్శంచారు. మహేందర్ రెడ్డి హైదరాబాదు వదిలి పారిపోయాడని భావిస్తున్నారు. మహేందర్ రెడ్డిది వరంగల్ జిల్లా ముప్పారం గ్రామం. దీంతో వరంగల్ జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. హత్యకు ముందు పండుకు, మహేందర్ రెడ్డికి మధ్య తీవ్రమైన పెనుగులాట జరిగినట్లు భావిస్తున్నారు. పండు పాలరాయితో మహేందర్ రెడ్డి తలపై బాదాడని, మహేందర్ రెడ్డి మద్యం బాటిల్ తో పండు పొట్టలో పొడిచాడని, దాంతో పండు మరణించాడని అనుకుంటున్నారు. అపార్టుమెంటు గేటు వద్ద రక్తం మరకలున్నాయి. దీన్ని బట్టి మహేందర్ రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు భావిస్తున్నారు.

పండు వద్దకు తరుచుగా రత్నాకర్ మరో వ్యక్తి వస్తుంటారని, ఆదివారం రాత్రి వారు వచ్చారా లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పండు హత్య కేసు నిందితులను పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఖాన్ చెప్పారు. పండు హత్య కేసుకు సంబంధించిన విషయాలు విజయవాడలోనే ఉన్నాయని, అందుకే విజయవాడకు ఓ బృందాన్ని పంపామని ఆయన చెప్పారు. మహేందర్ రెడ్డి అలియాస్ పిచ్చిరెడ్డి హత్య చేశాడని బలంగా నమ్ముతున్న పోలీసులు మహేందర్ రెడ్డి వెనక ఉన్నదెవరనే కోణం నుంచి ఆరా తీస్తున్నారు. మహేందర్ రెడ్డి అనుచరుడు బత్తినిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, విశాఖపట్నంలోని ఓ భూవివాదమే పండు హత్యకు కారణమని అనుకుంటున్నారు. దీంతో విశాఖ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఈ భూవివాదం నుంచి తప్పుకోవాలని పండుకు 15 రోజుల క్రితమే హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి విజయవాడ పోలీసుల వద్ద కేసు కూడా నమోదైనట్లు చెబుతున్నారు. వివాదం నుంచి తప్పుకోకుండా పండు హైదరాబాదుకు మకాం మార్చి ఇక్కడి నుంచే వ్యవహారం నడుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ భూవివాదంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హత్య వెనక తెలుగుదేశం రాష్ట్ర స్థాయి నాయకుల పాత్రపై ఆరా తీస్తున్నారు. మహేందర్ రెడ్డిని వాడుకుని పండును హత్య చేసి ఉంటారా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. పండు హత్యకు నిరసనగా విజయవాడలో బంద్ జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X