హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి వట్టి షోకుల వాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మైక్రో ఫైనాన్సు (సూక్ష్మరుణ సంస్థల)లు పేదలను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రబుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట భవన్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. మంత్రి వట్టి వసంత్ కుమార్ చేసిన వాఖ్యలు పేదలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. ప్రజలు పౌడర్లు, స్నోలు కొంటున్నారంటూ పేదలను అవమానించారని అన్నారు. బ్రతకడానికి లేని పరిస్థితుల్లో ప్రజలు అధిక వడ్డీలకు సూక్ష్మరుణ సంస్థలను ఆశ్రయిస్తుంటే పౌడర్లు కొంటున్నారనటం సమంజసమేనా ఆయన ప్రశ్నించారు. మంత్రి వట్టి వసంతకుమార్ దిగజారి మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు.

సూక్ష్మరుణ సంస్థలు అధిక వడ్డీలకు ప్రజలకు డబ్బులు ఇచ్చి వారి నడ్డి విరుస్తున్నాయన్నారు. ఇప్పటికే సూక్ష్మ బాధ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వం ఇలాగే ఉంటే సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు పెరుగుతాయని ఇప్పటికైనా సరియైన విధంగా స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సూక్ష్మరుణ వేధింపులకు ఏఐసిసి అధికార ప్రతినిధి రాహుల్ గాంధీయే కారణమన్న తన తెలుగు దేశం పార్టీ వాఖ్యలకు కట్టుబడి ఉందన్నారు. ఆకుల విక్రమ్ సూక్ష్మరుణ సంస్థ అయిన ఎస్ కె ఎస్ వేధింపులకు రాహుల్ గాంధీ కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీకి సైతం ఇందులో పాపం ఉందన్నారు. సోనియాగాంధీ స్వయంగా వచ్చి సూక్ష్మ బాధితుల బాధలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూక్ష్మరుణ సంస్థల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ప్రజలు డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రసాల సాధనాలపై అసహనం వ్యక్తం చేయటం మానేసి సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. పొరపాటునే గ్రహపాటునో ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పి ముఖ్యమంత్రి తన అసమర్థతను చాటుకున్నాడన్నారు. సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు అరికట్టడానికి అంటూ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం కోరలు లేనిదిగా ఉందన్నారు.

సూక్ష్మరుణ వేధింపులకు నిరసనగా వచ్చే నెల 2 నుంచి 8వ తేది వరకు నియోజకవర్గ స్థాయిల్లో, 9 నుంచి 15 వరకు జిల్లా స్థాయిల్లో, 16వ తేదిన రాష్ట్రస్థాయిలో తెలుగు దేశం పార్టీ ఆందోళన నిర్వహిస్తుందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X