కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి, తెలంగాణలపై స్పష్టంగా తేల్చేసిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: రెండు ప్రధానమైన అంశాలపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తేల్చేశారు. బిజెపితో జత కట్టవచ్చుననే ఊహాగానాలకు ఆయన తెర దించారు. ఎన్డీయెతో గానీ యుపిఎతో గానీ తన పార్టీ జత కట్టదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై కూడా తన వైఖరిని చెప్పారు. తెలంగాణ ఇచ్చేది తాను కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆ ప్రాంతంలో తన పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ''మనం పెట్టబోయే పార్టీ లౌకిక భావాలతో ఉంటుంది. మేనిఫెస్టోలో లేకపోయినా ముస్లింలకు నాన్న వైఎస్ నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు. మన పార్టీ తరఫున కడప అసెంబ్లీ టికెట్ ముస్లింలకే ఇస్తాను. ఎన్‌డీఏ, యూపీఏలతో సంబంధం లేకుండా, లౌకిక భావాలు గల పార్టీగా మన పార్టీ ఉంటుంది"" అని కడప ముస్లిం మత పెద్దలకు ఆయన హామీ ఇచ్చారు. కడపలోని హరూన్ బజాజ్ షోరూంలో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ముస్లిం మత పెద్దలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కొన్ని ప్రశ్నలను ఆయన ముందుంచారు.

జగన్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లింలకు ఏ మేరకు న్యాయం చేస్తారు, పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగా ఇక్కడ కూడా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా, ఎన్‌డీఏ వైపు ఉంటారా, లేక యూపీఏ వైపా, తెలంగాణపై పార్టీ వైఖరెలా ఉంటుంది వంటి ప్రశ్నలు వేశారు. వాటికి జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేకపోయినా వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. తన వెంట ముస్లింలున్నారని, వారి వెంట తానుంటానని అన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్‌ను అన్ని రంగాల్లోనూ అమలు చేస్తామని, సాధ్యమైతే ఆ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం తన చేతిలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా అక్కడ కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులున్నారని, అక్కడా పార్టీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ''నాన్న నాకు నేర్పింది ఒక్కటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, వెనక్కు తగ్గకపోవడం. నేను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను"" అని ముస్లిం మత పెద్దలకు భరోసా ఇచ్చారు. వైఎస్ మరణానంతరం సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానం తనను, తన కుటుంబాన్ని అవమానాలపాలు చేసి పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి కల్పించిన తీరును వారికి వివరించారు. జగన్ కూడా ఆయన తండ్రిలాగే ఇచ్చిన మాట తప్పరని హరూన్ బజాజ్ షోరూం అధినేత, మాజీ కార్పొరేటర్ అంజాద్ బాషా పేర్కొన్నారు. ఆయన వెంట ముస్లింలంతా నడుద్దామని మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X