హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవ్యాప్తంగా సెగ: మంత్రి బసవరాజు సారయ్యకు చేదు అనుభవం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో ఉపాధ్యాయుల దీక్షల శిబిరానికి వచ్చిన తెదేపా ఎమ్మెల్యే ఎల్‌.రమణను రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అడ్డుకున్నారు. జడ్చర్లలోని దీక్షలో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా భిక్కనూరు శివారులో మాజీ మంత్రి షబ్బీర్‌ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్‌ నియోజకవర్గ సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చిన తెలంగాణవాదులపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్ళ దాడి చేశారు. పరుగులు పెట్టిన తెలంగాణవాదులపై రాళ్ళువిసిరారు. ముగ్గురు గాయపడ్డారు.

వరంగల్‌లోని కాజీపేటలో ఆదివారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్‌ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కారును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వాహనాలను అడ్డుకొని పక్కనే ఉన్న మట్టి పెళ్లలను రువ్వడంతో కారు అద్దాలు ద్వంసమయ్యాయి. ఎంతకూ నిరసనకారులు పక్కకు తప్పుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీఛార్జి చేశారు. కాజీపేటకు వ్యాగన్‌ షెడ్‌ మంజూరైన సందర్భంగా వరంగల్‌ ఎంపీ రాజయ్య, మంత్రి సారయ్యకు సాయంత్రం 6 గంటలకు కాజీపేటలోని సంఘ్‌ కార్యాలయంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. దీనిని అడ్డుకోవడానికి తెరాస నాయకులు నార్లగిరి రమేష్‌, జీప్‌ డ్రైవర్ల సంఘం నాయకుడు కాటం రాజు నేతృత్వంలో కాజీపేట చౌరస్తా నుంచి మంత్రి కాన్వాయ్‌ వచ్చే దారిలో రెండు కిలోమీటర్ల పరిధిలో గుంపులు గుంపులుగా తెరాస, ఐకాస నాయకులు కార్యకర్తలు మోహరించారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారనుందని గ్రహించిన పోలీసులు మంత్రిని సభకు రావొద్దని చెప్పారు. తాను తప్పకుండా వెళ్తానని బయలుదేరారు. భవాని టాకీసు సమీపానికి రాగానే రెహమత్‌నగర్‌ వద్ద ఉన్న బృందం కారును అడ్డుకుంది. మట్టిపెళ్లలు, కోడి గుడ్లు రువ్వడంతో మంత్రి, ఎంపీ బయటకు రాలేదు. ఎక్కువ సంఖ్యలో జనం తోసుకురావడంతో కారును వెనక్కి పంపేందుకు ప్రయత్నించారు. వెనుక వైపు కూడా వాహనాలు స్తంభించడంతో అందులోనే ఉండిపోయారు. ఆందోళనకారులను చెదర గొట్టేందుకు పోలీసులకు లాఠీఛార్జీ చేశారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత సన్మాన సభకు వెళ్లకుండానే.. కడిపికొండ మీదుగా ఆయన వరంగల్‌కు వెళ్లారు.

మెదక్‌ జిల్లా చేగుంట మండలం నార్సింగిలో దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డిని ఆదివారం తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎమ్మెల్యే నార్సింగి రాగానే తెరాస నాయకులు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. పలువురు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసరగా అవి ఎమ్మెల్యే వాహనంపై పడ్డాయి. కార్యక్రమాలు ముగించుకుని వెళ్తుండగా మరోమారు రాళ్లతో దాడి చేయగా ఓకాంగ్రెస్‌ నాయకుడి వాహనం అద్దాలు పగిలాయి. తెలంగాణ వారిని తెలంగాణ వారే చంపుకొనే పరిస్థితి తెరాస నాయకులు తెస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చేగుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోలిపేట రామలింగారెడ్డి తనను చంపమని తెరాస నాయకులను ప్రోత్సాహిస్తున్నాడని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X