హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్థసారథి హత్యకు జగన్ కుట్ర: మంగలి కృష్ణ వాంగ్మూలం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పార్థసారథి హత్యకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కుట్ర చేశారని ఆరోపిస్తూ మంగలి కృష్ణ అనే వ్యక్తి వాంగ్మూలాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక శనివారం సంచికలో ఇచ్చింది. పార్థసారథి వైయస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజా రెడ్డి హత్యలో నిందితుడు. ఈ కేసులో నిర్దోషిగా పార్థసారథి విడుదలయ్యారు. సూట్‌కేస్ బాంబు కేసులో అనంతపురం వన్‌టౌన్ సీఐ పాపారావుకు దంతులూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ ఇచ్చిన వాంగ్మూలం ఇలా ఉందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన మంగలి కృష్ణ వాంగ్మూలం - 2001, మార్చి 19న అనంతపురం రైల్వేస్టేషన్ ఆవరణలో మెయిన్ గేటు వద్ద పెద్ద మనుషుల సమక్షంలో నమోదు చేసిన వాంగ్మూలం. నా పేరు దంతులూరి కృష్ణ. కడప జిల్లా పులివెందులలో నివసిస్తుంటాను. మా ఇంటికి దగ్గర్లోనే కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఇల్లుంది. ఆయన కుమారుడైన జగన్‌తో చిన్నప్పటి నుంచి స్నేహమైంది.

పులివెందుల యూత్ కాం గ్రెస్ కార్యదర్శిగా పని చేస్తూ జగన్ పర్సనల్ అసిస్టెంట్‌గా ఉన్నా ను. పులివెందులకు చెందిన శ్రీనాథరెడ్డి నాకు మిత్రుడు. సుమారు ఏడాదిన్నర కిందట శ్రీనాథరెడ్డి.. మద్దెలచెర్వు సూరి హైదరాబాద్ జైల్లో ఉన్నాడని, పరిచయం చేయిస్తానని చెప్పి నన్ను హైదరాబాద్ తీసుకెళ్లి సూరికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి మా నాయకుడు జగన్‌తో కలిసి అప్పుడప్పుడు జైల్లో ఉన్న సూరిని కలుస్తుండేవాళ్లం.

1999లో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో జగన్ నన్ను పిలిచి సూరి పెనుగొండ ఎమ్మెల్యే పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఎన్నికల ఖర్చు కింద లక్ష రూపాయలు సూరి మనిషైన రాజారెడ్డికి ఇవ్వమని చెప్పి ఆ డబ్బు నా చేతికిచ్చాడు. దానిని నేను రాజారెడ్డికి అందచేశాను. ఏడాది కిందట సూరి బెయిల్ కోసం జగన్ ఇచ్చిన 25 వేల డబ్బును రాజారెడ్డి ద్వారా సూరికి అందచేశాను.

ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం జగన్ నన్ను పిలిచి మా తాత రాజారెడ్డిని చంపిన పార్థసారథిరెడ్డిపై పగ తీర్చుకునే విషయంలో సూరి సహాయం చేస్తానన్నాడని, ఆ విషయంలో సూరి అనుచరులకు సహకరించమని చెప్పి సూరి సెల్ నెంబర్ ఇచ్చారు. దీంతో నేను జగన్ సలహా మేరకు ఆ సెల్‌నెంబర్‌కు ఫోన్ చేయగా సూరి మాట్లాడాడు. తాను, జగన్ కలిసి పార్థసారథిరెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నామని, నా మనిషి రామచంద్రారెడ్డి నీ దగ్గరికి వస్తాడని, మిగతా విషయాలు మాట్లాడతాడని చెప్పాడు. 2000, అక్టోబరులో రామచంద్రారెడ్డి నా వద్దకు వచ్చాడు.

పార్థసారథిరెడ్డిని సూట్‌కేస్ బాంబు పెట్టి చంపుతానన్నాడు. సూట్‌కేస్ బాంబు పేలితే ఎక్కువ మంది చనిపోతారని, మన టార్గెట్ పార్థసారథిరెడ్డి ఒక్కడే కాబట్టి, అతన్నే చంపాలని, ఎక్కువమంది చనిపోతే రాజశేఖర్‌రెడ్డికి చెడ్డపేరు వస్తుందని, పార్థసారథి మూమెంట్స్‌పై సూరికి సమాచారం ఇస్తానని, అతడితో కాంటాక్ట్‌లో ఉండమని చెప్పి పంపించాను. నవంబరు 29, డిసెంబరు 11 తేదీల్లో కడప కోర్టులో వాయిదాలకు పార్థసారథి వస్తున్నాడని తెలుసుకుని ఆ విషయాన్ని సూరికి చెప్పాను.

28, నవంబరున రామచంద్రారెడ్డి అతని స్నేహితుడైన గొట్లూరి చంద్రశేఖర్‌రెడ్డి పులివెందులకు వచ్చి నన్ను కలిశారు. పార్థసారథిని కడప కోర్టులో బాంబులు వేసి రివాల్వర్‌తో కాల్చి చంపాలని ప్లాన్ వేసుకున్నామని చెప్పగా నేను రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కోర్టుకు పోయి రెక్కీ నిర్వహించి ఆ రాత్రి అక్కడే గ్రీన్‌పార్క్ లాడ్జీలో ఉన్నాము. 29, నవంబరున నాక్కూడా కడప కోర్టులో వాయిదా ఉన్నందున కోర్టుకు వచ్చిన రామచంద్రారెడ్డి మనుషులకు పార్థసారథిరెడ్డిని చూపించాను.

సెక్యూరిటీ ఎక్కువ ఉన్నందున చంపకుండా వెనక్కి వెళ్లిపోయారు. మళ్లీ డిసెంబరు 10న సాయంత్రం చంద్రశేఖర్‌రెడ్డి పులివెందులకు వచ్చి మా మనుషులు కడపకు వచ్చారు, ఖర్చులకు అయిదువేలు తీసుకురమ్మని రామచంద్రారెడ్డి పంపించాడని చెప్పాడు. నేను డబ్బు ఇచ్చి పంపించాను. 11వ తేదీన పార్థసారథిరెడ్డి ఎక్కువమంది మనుషులతో రావటంతో ఏమీ చేయలేక తిరిగిపోయినారు. - ఇదీ మంగలి కృష్ణ వాంగ్మూలం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X