రాజాపై వేటుకు డిఎంకె మొగ్గు!: రాజాకు మద్దతుగా లాయర్ల ఆందోళన

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రతిపక్షాలు రాజా అవినీతిని ఉపయోగించుకుని లాభపడతారని డిఎంకే యోచిస్తుంది. జయలలిత రాజా స్కాంను తమపై ఎక్కుపెట్టవద్దనుకుంటే ఆయనపై వేటే సరియైన చర్యగా భావిస్తున్నట్టుగా తెలిస్తోంది. అయితే రాజాను ఓసారి బెదిరించి వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే రాజా స్కాం ప్రభావం సిటీలో, చదువుకున్న వారిలోనే తప్ప గ్రామీణానికి అంతగా తెలియదనే వారు ఉన్నట్టుగా తెలిస్తోంది. ఆ కారణంగా రాజాకు ఓ అవకాశం ఇచ్చి చూడవచ్చు అనే వారూ ఉన్నారంటున్నారు.
ఈ నేపథ్యంలో సాయంత్రం చెన్నైలో డిఎంకే భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో కీలక తీర్మానాలు చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తమిళనాడులో లాయర్లు రాజాకు మద్దతుగా నిలిచారు. గురువారం మధ్యాహ్నం రాజా అరెస్టుకు నిరసనగా హైకోర్టులో ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications