వైయస్సార్ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్‌తో జగన్ భేటీ, పార్టీపై కసరత్తు

శివకుమార్ దాదాపు అరగంట సేపు జగన్‌తో మాట్లాడారు. ఆ తర్వాత మీడియా కంట పడకుండా వేరే కారులో వెళ్లిపోయారు. తన పార్టీ స్థాపనపై వైయస్ జగన్ శుక్రవారం ఉదయం నుంచి తన అనుచరులతో మాట్లాడుతున్నారు. దశలవారీగా ఈ చర్చలు జరుపుతున్నారు. జెండా, ఎజెండాలపై ఆయన మంతనాలు జరుపుతున్నారు. పార్టీ స్థాపనకు ముందే జిల్లాల సమన్వయకర్తలను కూడా ఆయన నియమిస్తున్నారు. దీంతో పార్టీ స్థాపన నాటికే బలమైన వ్యవస్థాగత నిర్మాణం ఉండాలనేది ఆయన ఉద్దేశమని తెలుస్తోంది.
Comments
English summary
YSR party founder Shiva kumar met ex MP YS Jagan today. In a bid to get YSR party, YS jagan is talking with Shiva kumar. YS Jagan is also holding talks with his followers to finalise his party agenda.
Story first published: Friday, February 11, 2011, 16:02 [IST]