వైయస్ జగన్‌ను చిత్తు చేస్తా: వైయస్ వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అవకాశం ఇస్తే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపైన పోటీ చేయడానికి సిద్ధమని వ్యవసాయ శాఖామంత్రి వైయస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఓ టీవీ ఛానల్ ముఖాముఖిలో చెప్పారు. మంగళవారం ఆయన తన మామయ్యతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతిస్తే పోటీకి సిద్ధం అని ప్రకటించారు. పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ అండతో తప్పకుండా గెలుస్తానని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నందున ప్రజలకు చాలా మంచి పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయాలు అంటే నా దృష్టిలో ప్రజలకు సేవ చేసే భాగ్యమని చెప్పారు.
సోనియాగాంధీ మా కుటుంబాన్ని చీల్చారని వచ్చిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సోనియాకు అలాంటి అవసరం లేదని చెప్పారు. మా మామయ్య చాలా మంచోడని వైయస్ వివేకానందకు కితాబునిచ్చారు. ప్రజలకు, మా ప్రాంతానికి, రాష్ట్రానికి ఎలా మంచి చేయాలా అనే ఆలోచనలే వివేకానందకు ఉంటాయన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే మంత్రి పదవిని తీసుకున్నారన్నారు. అయితే కుటుంబాన్ని చీల్చడానికి సోనియా ఇచ్చారనే ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదన్నారు. కడప పార్లమెంటు అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానన్నారు. ఫలితం మాత్రం మన కష్టాన్ని బట్టి ఉంటుందన్నారు.
ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితో బాగా కష్టపడితే విజయం వరిస్తుందన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చేదే ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పారు. మా నాన్న ముప్పయ్యేళ్లు రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లో ఉండాలంటే ప్రజలను కుటుంబసభ్యులుగా చూడాలని మా నాన్న చెప్పేవారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూడా అదే చెప్పేవారని నేను వారు చెప్పిన బాటలో నడుస్తానని చెప్పారు.
"I am ready to contest on Ex MP YS Jaganmohan Reddy, if Congress High Command will give ticket" said Narreddy Rajasekhar Reddy, agriculture minister YS Vivekananda Reddy son-in-law. He denied, AICC president Sonia Gandhi 's role in division of YS Family.
Story first published: Tuesday, February 15, 2011, 16:40 [IST]