జెపిపై తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డ్రైవర్ మల్లేష్ దాడి చేశాడా?

కాగా, జయప్రకాష్ నారాయణపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు కూడా గాయపడ్డారు. అప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్న పాలడుగు వెంకటరావు దాడితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆస్పత్రిలో చేరారు. పాలడుగు తనపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించి అస్వస్థతకు గురయ్యారని జయప్రకాష్ నారాయణ కూడా చెప్పారు. కాగా, ప్రజాస్వామ్యం పేరు చెప్పి, తమను తాము మేధావులుగా చెప్పుకుంటూ జయప్రకాష్ నారాయణ వంటి నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నాయకులు జగదీశ్వర్ రెడ్డి, శ్రవణ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. శాసనసభ సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారన్నారు.