జెపిపై దాడి చేసిన ఈటెల డ్రైవర్ మల్లేష్‌కు 45 రోజుల జైలు శిక్ష
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ డ్రైవర్ మల్లేష్‌కు జైలు శిక్ష విధించారు. జెపిపై దాడి చేసిన మల్లేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. అనంతరం వారు మల్లేష్‌ను డిప్యూటీ స్పీకరు నాదెండ్ల మనోహర్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం నాదెండ్ల ఆయనకు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే రావాల్సిన మీడియా పాయింట్ వద్దకు డ్రైవర్ రావడాన్ని కూడా నాదెండ్ల తప్పు పట్టారు.
కాగా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన దాడిపై స్పీకరు శిక్ష వేయడానికి అధికారం ఉంటుంది. అసెంబ్లీ ప్రాంగణం వ్యవహాలు కోర్టులో చెల్లవు. టిఆర్ఎస్ నేతలు ఈ విషయంపై కోర్టుకు అప్పీలు చేయడానికి కూడా హక్కు లేదు. అప్పీలుకు అవకాశం లేకున్నప్పటికీ అసెంబ్లీలో నిరసన తెలిపే హక్కు మాత్రం ఉంది. శిక్ష విధించే పూర్తి అధికారం స్పీకరుకే ఉంటుంది.
Deputy Speaker Nadendla Manohar sentenced TRS MLA Eetela Rajendar's driver Mallesh for 45 days, as he attack on Lok Satta President Jayaprakash Narayana.
Story first published: Friday, February 18, 2011, 14:44 [IST]