హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో ఉస్మానియాలో రాత్రి ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్ అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో ఉస్మానియా యూనివర్శిటీ మరోసారి భగ్గుమంది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఐదు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో పరిసర ప్రాంతాలు భయంతో వణికిపోయాయి. బస్సులను దగ్ధం చేయడంతో పోలీసులు యూనివర్శిటీలోకి రాకపోకలను బంద్ చేయడానికి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తార్నాకలో మూడు, హబ్సిగూడలో ఒకటి, ఓయులో ఒక బస్సు దగ్ధమయ్యాయి.

సస్పెన్షన్ చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలపై ఎత్తి వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత రాత్రి వరకు ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా, ఒక్కసారిగా రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

English summary
Enraged over the suspension of TRS and TDP MLAs from the assembly and demanding tabling of bill on seperate Telangana in parliament, unidentified persons, suspected to be OU students, set five buses on fire near the OU campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X