వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఝాన్సీ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు: కోదండరాం

ఝాన్సీ మృతిపై పార్టీలకతీతంగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తమ సంతాపాన్ని తెలియజేశారు. ఝాన్సీ మృతితో మంచి నాయకురాలిని కోల్పోయామని ప్రముఖ సినీ నటి రోజా, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. ఝాన్సీ మృతి తెలంగాణ ఉద్యమానికి తీవ్ర నష్టమని రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు.