వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపిసిపై 22న తీర్మానం: దిగొచ్చిన కేంద్రం, పంతం నెగ్గించుకున్న విపక్షాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రంపై ప్రతిపక్షాల జెపిసికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఆదివారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి జెపిసిపై చర్చించారు. బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాలు స్మూత్‌గా సాగడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. అఖిల పక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు, విపక్షాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అఖిలపక్షం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో విపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. స్పీకర్ విధివిధానాలు రూపొందించనున్నారు.

2జి స్పెక్ట్రంపై ప్రతిపక్షాలకు, అధికార పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నెల 22న జాయింట్ యాక్షన్ పార్లమెంటు ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. అయితే ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మాత్రం 2జి స్పెక్ట్రంతో పాటు ఈ రెండేళ్లలో జరిగిన పలు కుంభకోణాలపై కూడా జెపిసి వేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు సహకరించాలని మీరాకుమార్‌ విపక్ష నేతలను కోరనున్నారు

English summary
Congress government was agreeded for opposition demand, JPC on 2G Spectrum today in All Party Meeting. leaders 
 
 of political parties to ensure that parliament, which begins on Monday, functions smoothly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X