హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను మేమే తెలంగాణ ద్రోహిగా ప్రకటించాం: ఈటెల రాజేందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etala Rajender
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితికి గల రహస్య ఒప్పందాలను టిఆర్ఎస్‌ఎల్పీ ఈటెల రాజేందర్ మంగళవారం ఖండించారు. అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడిన తర్వాత ఆయన ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. జగన్‌తో టీఅర్ఎస్‌కు రహస్య ఒప్పందాలేవీ లేవన్నారు. జగన్‌ను మొదటగా ద్రోహిగా ప్రకటించిందే మేమని చెప్పారు. సోమవారం చలో అసెంబ్లీ ఘటనలో అరెస్టు చేసిన విద్యార్థులపై వెంటనే కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులను విడుదల చేయకుండే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

తెలుగుదేశ పార్టీ తెలంగాణ తీర్మాణం ప్రవేశ పెట్టాలని అనుకోవడం అభినందనీయమని టిఆర్ఎస్ మరో కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అంతరాత్మ ప్రభోదం ప్రకారం ఓటింగ్ జరగాలంటే ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని తెలుగుదేశం అనుకుంటే వ్యక్తుల ద్వారా చెప్పించడం సరికాదన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణపై తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

English summary
TRSLP leader Etela Rajender condemned today that TRS support to Ex MP YS Jaganmohan Reddy allegations. Another MLA KTR praises TDP on resolution issue. He demanded TDP President Chandrababu to announce party decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X