కడప:
కడప
జిల్లా
రాజకీయాల్లో
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైయస్
జగన్
వర్గం
వ్యూహాత్మకంగా
ముందుకు
కదులుతోంది.
ఎమ్మెల్సీ
ఎన్నికల్లో
కడప
జిల్లా
నుంచి
వ్యవసాయ
శాఖ
మంత్రి,
వైయస్
జగన్
బాబాయ్
వైయస్
వివేకానంద
రెడ్డిని
ఏకగ్రీవంగా
ఎన్నుకోవాలని
నిర్ణయించింది.
జగన్
వర్గానికి
చెందిన
శ్రీకాంత్
రెడ్డి,
ఆదినారాయణ
రెడ్డి,
తదితర
శాసనసభ్యులు
శనివారం
సమావేశమై
ఈ
మేరకు
నిర్ణయం
తీసుకున్నారు.
ఉప
ఎన్నికల్లో
దివంగత
నేత
వైయస్
రాజశేఖర
రెడ్డి
సతీమణి
వైయస్
విజయలక్ష్మిపై
వివేకానంద
రెడ్డి
పులివెందుల
నియోజకవర్గం
నుంచి
పోటీ
చేయకూడదని,
అందుకుగాను
ఎమ్మెల్సీ
ఎన్నికల్లో
ఏకగ్రీవంగా
వివేకానంద
రెడ్డి
ఎన్నికయ్యేలా
చూస్తామని
వారు
చెప్పారు.
వైయస్
రాజశేఖర
రెడ్డి
కుటుంబం
విడిపోకూడదనే
ఉద్దేశంతోనే
తాము
ఎమ్మెల్సీ
ఎన్నికల్లో
వైయస్
వివేకానంద
రెడ్డిని
ఏకగ్రీవంగా
ఎన్నుకోవాలని
తాము
నిర్ణయించుకున్నామని
వారు
చెప్పారు.
వైయస్
విజయలక్ష్మిపై
వివేకానంద
రెడ్డి
పోటీ
చేస్తే
తల్లికి
ద్రోహం
చేసినట్లేనని
వారు
వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ
ఎన్నికల్లో
వివేకానంద
రెడ్డి
పోటీ
చేయడానికి
సిద్ధపడకపోతే
శాసనసభ్యుడు
ఆదినారాయణ
రెడ్డి
సోదరుడు
నారాయణ
రెడ్డిని
పోటీకి
దించాలని
వైయస్
జగన్
వర్గం
నిర్ణయించింది.
తాము
వైయస్
వివేకానంద
రెడ్డి
పట్ల
ఉదారంగానే
ఉన్నామని,
కాంగ్రెసులోనే
ఉండాలని
నిర్ణయించుకున్నా
వైయస్
సోదరుడిగా
వైయస్
వివేకానంద
రెడ్డిపై
తమకు
అభిమానం
ఉందని,
వైయస్
వివేకానంద
రెడ్డే
అందుకు
సిద్ధంగా
లేరని
ఉప
ఎన్నికల్లో
ప్రచారం
చేయడానికి
వీలవుతుందనే
ఉద్దేశంతోనే
వైయస్
జగన్
వర్గం
ఈ
విధమైన
వ్యూహాన్ని
ఎంచుకున్నట్లు
తెలుస్తోంది.
Ex MP YS Jagan Kadapa district MLAs decided to support Minister YS Vivekananda Reddy in MLC election. To avoid
YS Vivekanamda Reddy's contest from Pulivendula assembly seat, they took that decission.
Story first published: Saturday, February 26, 2011, 12:36 [IST]