సిఎం కిరణ్ ప్రభుత్వాన్ని త్వరలో కూలుస్తాం: జగన్ వర్గం జూపూడి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని త్వరలో కూల్చివేస్తామని మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు ఆదివారం హెచ్చరించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోయిందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను కిరణ్ ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కిరణ్ ప్రభుత్వాన్ని త్వరలో కూల్చివేస్తామని అన్నారు.
రాష్ట్రంలో 45 రోజుల్లో రాష్ట్రపతి పాలన రానుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. బడ్జెట్ సమావేశాలలో గవర్నర్‌ను అవమానించడంలో ప్రభుత్వం వైఫల్యం ఉందన్నారు. గవర్నర్‌కు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా కిరణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Ex MP YS Jaganmohan Reddy camp MLC Jupudi Prabhakar Rao warned that they will overthrough CM Kirankumar Reddy government soon. He demanded CM Kirankumar Reddy resignation.
Story first published: Sunday, February 27, 2011, 14:44 [IST]