సిఎం క్లాస్: తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ

తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైన సిద్ధమని చెప్పారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో పోరాడామని, ఇకనుండి ప్రజలలోకి వెళ్లి తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. కాగా అంతకుముందు తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వారికి ఆయన క్లాస్ తీసుకున్నారు. అంతకుముందు అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించడంతో వారితో ఆయన భేటీ అయ్యారు. స్వపక్షంలో ఉండి విపక్షంలా ప్రవర్తించడం ఏమిటని వారిని అడిగినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి వారిని కోరినట్టుగా తెలుస్తోంది. సభలో ఉండి నిరసన తెలపవద్దని, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అయితే ఆయన కోరికను వారు తిరస్కరించి పూర్తిగా సమావేశాలనే బహిష్కరించడానికి నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications