రాజీనామా యోచనలో కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు?
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
తెలంగాణ
ప్రాంతానికి
చెందిన
కాంగ్రెసు
పార్టీ
శాసనసభ్యులు,
శాసనమండలి
సభ్యులు
రాజీనామా
యోచనలో
ఉన్నట్టుగా
తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు
శుక్రవారం
ఉదయం
వరంగల్
జిల్లాకు
చెందిన
యువ
ఎమ్మెల్యే
గండ్ర
వెంకటరమణారెడ్డి
ఇంటిలో
భేటీ
అయ్యారు.
కాంగ్రెసు
పార్టీ
తెలంగాణను
అనుకూలంగా
నిర్ణయం
తీసుకోవాలని
వారు
అధిష్టానంపై
ఒత్తిడి
తీసుకు
రావడానికి
సిద్ధమయ్యారు.
వారంతా
దేవాదాయ
శాఖ
మంత్రి
జూపల్లి
కృష్ణారావు
దారిలో
నడవాలని
యోచిస్తున్నట్టుగా
తెలుస్తోంది.
అధిష్టానం
ప్రత్యేక
తెలంగాణకు
అనుకూలంగా
లేక
పోయినా,
ఈ
బడ్జెట్
సమావేశాలలో
తెలంగాణ
బిల్లు
పెట్టక
పోయినా
అధిష్టానంపై
ఒత్తిడి
పెంచే
దిశలో
ఆలోచిస్తున్నట్టుగా
తెలుస్తోంది.
అధికార
పార్టీలో
ఉండి
కూడా
ఇప్పటికే
అసెంబ్లీ
సమావేశాలను
బహిష్కరించడం
వల్ల
ప్రభుత్వంపై
కాస్త
ఒత్తిడి
పెంచగలిగామని,
అయితే
తెలంగాణ
రాష్ట్ర
ప్రకటనకు
అనుకూలంగా
కేంద్రంపై
ఒత్తిడి
తీసుకు
రావాలంటే
రాజీనామా
చేయడమే
సరియైన
చర్యగా
వారు
భావిస్తున్నట్లాగా
తెలుస్తోంది.
అయితే
శుక్రవారం
సాయంత్రం
న్యూఢిల్లీ
నుండి
కాంగ్రెసు
పార్టీ
పార్లమెంటు
సభ్యులు
హైదరాబాద్‌కు
తిరిగి
వస్తున్నారు.
ఈ
నేపథ్యంలో
ఎంపీలు
తిరిగి
వచ్చిన
తర్వాత
ఎంపీలు,
మంత్రులు
అందరితో
కలిసి
చర్చించి
అందరూ
కలిసి
నిర్ణయం
తీసుకుంటే
బావుంటుందనే
నిర్ణయానికి
అంతిమంగా
వచ్చినట్టుగా
తెలుస్తోంది.
శనివారం
సాయంత్రం
ఎంపీలు,
మంత్రులు,
ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు
అంతా
సమావేశమై
తెలంగాణపై
భవిష్యత్తు
కార్యాచరణపై
భేటీ
అయ్యే
అవకాశాలు
ఉన్నట్టుగా
తెలుస్తోంది.
కేవలం
ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు
మాత్రమే
కాకుండా
ఎంపీలు,
మంత్రులతో
కలిసి
అందరూ
ఒకే
నిర్ణయం
తీసుకొని
పార్టీ
అధిష్టానంపై
ఒత్తిడి
తీసుకు
వస్తే
బావుంటుందనే
నిర్ణయానికి
వచ్చినట్టుగా
తెలుస్తోంది.
Telangana MLAs and MLCs are thinking to resign. They met in MLA Gandra Venkata Ramana Reddy residence on friday. MLAs, MLCs, MPs, Ministers will meet saturday to take final decision.
Story first published: Friday, March 4, 2011, 11:51 [IST]