ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణ హత్య, భర్తే నరికి చంపాడని ఆరోపణ
Districts
oi-Pratapreddy
By Pratap
|
విశాఖపట్నం:
ఇంజినీరింగ్
చదువుతున్న
ఓ
వివాహిత
యువతి
విశాఖపట్నంలో
నడిరోడ్డుపైనే
దారుణ
హత్యకు
గురైంది.
నగరంలోని
పిఠాపురం
కాలనీలో
కళాభారతి
వద్ద
రహదారిపై
వెళ్తున్న
దువ్వి
కృష్ణవేణి
(19)ని
వెనక
నుంచి
వచ్చిన
ఓ
వ్యక్తి
తెగనరికాడని
స్థానికులు
చెబుతున్నారు.
కట్నం
కింద
ఇల్లు
రాసివ్వలేదనే
కోపంతో
ఉన్మాదిలా
వేధిస్తున్న
ఆమె
భర్తే
తమ
కుమార్తెను
హతమార్చాడంటూ
మృతురాలి
తల్లిదండ్రులు
ఆరోపిస్తున్నారు.
పెళ్త్లెన
6
నెలలకే
ఈ
దారుణం
చోటు
చేసుకుంది.
విశాఖపట్నం
శివాజీపాలేనికి
చెందిన
దువ్వి
సత్యనారాయణ,
వేణు
దంపతులకు
ఇద్దరు
కుమార్తెలు.
పెద్దకుమార్తె
కృష్ణవేణి
దువ్వాడలో
ఇంజినీరింగ్
ద్వితీయ
సంవత్సరం
చదువుతోంది.
10వ
తరగతి
వరకే
చదివి,
డ్రైవర్‌గా
చిన్న
ఉద్యోగం
చేస్తున్న
రవికుమార్‌తో
గత
ఏడాది
ఆగస్టు
29న
కృష్ణవేణి
వివాహం
జరిగింది.
పెళ్లి
సమయంలో
రూ.1.20
లక్షల
కట్నం
కూడా
ఇచ్చారు.
రవికుమార్
ఆమెను
కట్నం
కోసం
వేధించడం
ప్రారంభించాడు.
ఈ
నేపథ్యంలోనే
శుక్రవారం
ఇంటికి
తిరిగి
వస్తున్న
కృష్ణవేణిని
పిఠాపురం
కాలనీ
కళాభారతి
వద్ద
అటకాయించాడు.
కొద్దిసేపు
ఇద్దరికీ
రోడ్డుపైనే
వాగ్వాదం
జరిగింది.
కోపోద్రిక్తుడైన
రవికుమార్
పక్కనే
ఉన్న
కొబ్బరి
బోండాల
దుకాణంలో
ఉన్న
కత్తిని
తీసుకుని
ఆమె
మెడపై
వేటువేశాడు.
దీంతో
కృష్ణవేణి
అక్కడికక్కడే
కుప్పకూలిపోయింది.
రవికుమార్
పారిపోయాడు.
పోలీసులు
సంఘటన
స్థలానికి
చేరుకుని
కృష్ణవేణిని
కేజీహెచ్‌కు
తరలించగా
అప్పటికే
ఆమె
చనిపోయినట్లు
వైద్యులు
నిర్ధారించారు.
సీపీ
ఆదేశాల
మేరకు
నిందితుడిని
పట్టుకునేందుకు
ప్రత్యేక
బృందాలు
రంగంలోకి
దిగాయి.
Engineering student Krishnaveni murdered in Vishakapatnam yesterday. It is alleged that Her husband Ravikumar hacked to death her. It created chaos in Vishakapatnam.
Story first published: Saturday, March 5, 2011, 9:40 [IST]