ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసంపై దద్ధరిల్లిన అసెంబ్లీ, వాయిదా

ట్యాంక్‌బండ్‌పై విధ్వంసంపై ప్రారంభంలోనే అరగంట వాయిదా పడ్డ శాసనసభను తిరిగి ఆరంభమైన మరికొద్ది సేపటికే మరో పదిహేను నిమిషాలపాటు వాయిదా వేస్తూ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభను సజావుగా నిర్వహించేందుకు ఫ్లోర్ లీడర్‌లు తన ఛాంబర్‌కు రావాలని చెప్పి సభను వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత విగ్రహాల విధ్వంసంపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన చేస్తారని మంత్రి శ్రీధర్‌బాబు సభలో చెప్పినప్పటికీ తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో విధి లేక నాదెండ్ల మనోహర్ మరోసారి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications